‘సైరా’ సరికొత్త రికార్డ్…మెగాస్టార్ స్టామినా అస్సలు తగ్గలేదు..

349

మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ నంబర్ 150’ తరవాత ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా చేస్తున్నారని ప్రకటించగానే మెగా అభిమానులు పండగ చేసుకున్నారు. ఇక ఈ సినిమాను స్వయంగా రాంచరణ్ నిర్మిస్తుండడంతో ఇంకా ఎక్కువ ఆనందపడ్డారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కథను పరుచూరి బ్రదర్స్ అందించగా.. సాయిమాధవ్ బుర్రా మాటలు రచించారు. బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది మ్యూజిక్ సమకూరుస్తున్నారు.

Image result for saira narasimha reddy

మోషన్ పోస్టర్‌ను విడుదల చేసి ఇదో రాయలసీమ స్వాతంత్య్ర సమరయోధుడి జీవిత కథ అని చెప్పగానే రికార్డులు బద్దలు కావడం ఖాయమని అన్నారు. ఆ రికార్డులు అప్పుడే మొదలైపోయాయి. చిరంజీవి పుట్టినరోజును పురష్కరించుకుని మంగళవారం విడుదలైన టీజర్.. ‘సైరా’ రికార్డుల పరంపరను మొదలుపెట్టింది.‘సైరా’ టీజర్ దెబ్బకు సోషల్ మీడియా షేక్ అయిపోతోంది.టీజర్ విడుదలైన 24 గంటల్లోనే 12 మిలియన్ల డిజిటల్ వ్యూస్ వచ్చాయంటే మెగాస్టార్ స్టామినా ఇంకా ఏ స్థాయిలో ఉందో అర్థమైపోతోంది. విడుదలైన 24 గంటల్లో అత్యధిక డిజిటల్ వ్యూస్ సాధించిన టీజర్‌గా ‘సైరా’ రికార్డులకెక్కింది.

Related image

గతంలో ‘భరత్ అనే నేను’ టీజర్ 24 గంటల్లో 9.1 మిలియన్ వ్యూస్ సాధించింది. ‘అజ్ఞాతవాసి’ టీజర్ 6.4 మిలియన్ వ్యూస్, ‘రంగస్థలం’ టీజర్ 5.9 మిలియన్ వ్యూస్ సాధించాయి. ఇటీవల విడుదలైన ‘అరవింద సమేత’ టీజర్ 24 గంటల్లో 5.88 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. ఇప్పుడు వీటన్నిటికీ అందనంత దూరంలో ‘సైరా’ టీజర్ రికార్డ్ వ్యూస్ సాధించింది. మెగాస్టార్ స్టామినా ఎలా ఉంటుందో మరోసారి రుజువు చేసింది.‘సైరా’ టీజర్‌కు సామాన్య ప్రేక్షకుల నుంచే కాకుండా సినీ ప్రముఖుల నుంచి కూడా విపరీతమైన స్పందన వస్తోంది.వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.