శైలజా రెడ్డి అల్లుడుకు సమస్యగా మారిన సమంత నిర్ణయం..

384

నాగ చైతన్య మారుతి కాంబినేషన్ లో వస్తున్న సినిమా శైలజా రెడ్డి అల్లుడు.ఈ సినిమా ఈ నెల 31న రిలీజ్ కావాల్సి ఉంది. అయితే అనుకున్న విధంగా ఆగష్టు 31నుండి సినిమా సెప్టెంబర్ 13కి వాయిదా వేశారు.ఈ సినిమా మీద బారీ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి.ఈ మద్యనే విడుదల అయినా పాటలు అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకున్నాయి.

Image result for shailaja reddy alludu

అయితే ఈ సినిమాను ముందు అనుకున్న డేట్ కంటే సెప్టెంబర్ 13 న విడుదల చెయ్యడం వెనుక ఏమైనా కారణాలు ఉన్నాయా అని ఆరా తీస్తే కేరళ వరదల కారణంగా సినిమాకు మ్యూజిక్ అందించే గోపి సుందర్ స్టూడియోల వల్ల ఇబ్బంది కలిగిందని దాని వల్లే శైలజా రెడ్డి అల్లుడు ఆర్. ఆర్ పూర్తి కాలేదని అన్నారు.అయితే అదో కారణం అయితే సినిమా రిలీజ్ వాయిదా పడటానికి సమంత కూడా మరో కారణమని తెలుస్తుంది. శైలజా రెడ్డి సినిమా రషెస్ చూసిన సమంత సినిమాలో వెన్నెల కిశోర్ కామెడీ సీన్స్ పై అభ్యంతరం వ్యక్తం చేసిందట. వాటిని మళ్లీ రీషూట్ చేయాల్సిందిగా దర్శకుడు మారుతికి సూచించిందట.

Related image

కామెడీపై మంచి పట్టున్న మారుతి వెన్నెల కిశోర్ సీన్స్ అంత ప్రభావితపరచలేదన్నది సమంత వర్షన్.ఈ రీ షూట్ వల్లే సినిమా రిలీజ్ వాయిదా వేశారని అంటున్నారు. ఈ సినిమా మీద అంచనాలు ఉండటం వల్ల చైతు చందు మొండేటి డైరక్షన్ లో చేస్తున్న సవ్యసాచి రిలీజ్ వాయిదా వేసుకున్నాడు. మరి సెప్టెంబర్ 13 అయినా శైలజా రెడ్డి అల్లుడు వస్తాడా లేడా అన్నది వేచిచూడాలి.నిజంగానే రీ షూట్ చేస్తే సినిమా మళ్ళి వాయిదా పడే అవకాశం ఉంది.చూడాలి మరి ఏం జరుగుతుందో.