టాప్ డైరెక్టర్ తో సాయి పల్లవి పెళ్లి ఫిక్స్… ఎవరో తెలిస్తే షాక్..

297

ప్రేమమ్ చిత్రంతో సౌత్ లో గుర్తింపు పొందిన సాయి పల్లవి, ఫిదా చిత్రంతో తెలుగులో కూడా క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. భానుమతి క్యారెక్టర్ తో తెలుగువారి గుండెల్లో ఎప్పటికి నిలిచిపోయే నటనను కనపరిచింది. అందాల ఆరబోతకు దూరంగా ఉండే సాయి పల్లవి నటనతోనే ఇంతటి క్రేజ్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా కుర్రకారు సాయిపల్లవి నటనకు ఫిదా అవుతుంటారు. ఫిదా, ఎంసీఏ, పడిపడి లేచే మనసు లాంటి చిత్రాలు సాయి పల్లవి నటించింది. తాజాగా సాయి పల్లవి గురించి ఓ ఆసక్తికరమైన రూమర్ ప్రచారం జరుగుతోంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం!

సాయి పల్లవి ఓ తమిళ దర్శకుడితో ఘాటైన ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ దర్శకుడు మరెవరో కాదు.. అమలాపాల్ మాజీ భర్త విజయ్. విజయ్ దర్శకత్వంలో సాయి పల్లవి కారు దర్శకత్వంలో నటించింది. అప్పటి నుంచి వీరి మధ్య బంధం బలపడినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం సాయి పల్లవి, విజయ్ సహజీవనం చేస్తున్నట్లు తమిళ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఇటు అభిమానులని కూడా సాయి పల్లవి లవ్ ఎఫైర్ న్యూస్ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. ఈ జంట త్వరలో వివాహానికి కూడా సిద్ధం అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. తమ రిలేషన్ షిప్ ని సాయి పల్లవి, విజయ్ అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. అమలాపాల్, విజయ్ 2014లో వివాహం చేసుకున్నారు. విభేదాలతో 2017లో విడిపోయారు. ఆ తర్వాత అమలాపాల్, విజయ్ వారి వారి చిత్రాలతో బిజీ అయిపోయారు. ఈ క్రమంలో విజయ్, సాయి పల్లవి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది అని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తల మీద సాయి పల్లవి గట్టిగానే రియాక్ట్ అయ్యింది.

Image result for sai pallavi

అస‌లు నిజాలు తెలుసుకోకుండా ఇలాంటి వార్త‌లు ఎలా రాస్తారు అంటూ మండిప‌డింది ఈ ముద్దుగుమ్మ‌. దేనికైనా ఓ హ‌ద్దు ఉంటుంది. ఉన్న‌వి లేనివి ఇలా ఎలా రాస్తారంటూ మీడియాకు క్లాస్ పీకింది సాయి ప‌ల్ల‌వి. త‌న పెళ్లి విష‌యంలో అంత తొంద‌రేం లేద‌ని.. ఒక‌వేళ చేసుకోవాల్సి వ‌చ్చినా క‌చ్చితంగా చెప్పే చేసుకుంటాన‌ని చెబుతుంది ఈ భామ‌. ఉన్న‌ట్లుండి త‌న‌పై ఇలాంటి వార్త‌లు రావ‌డంతో నిజంగానే సాయి ప‌ల్ల‌వి కూడా షాక్ అయింది. అస‌లు బేస్ లెస్ రూమ‌ర్స్ రాయ‌డం మందిచి కాద‌ని చెబుతుంది ఫిదా బ్యూటీ. సాయి పల్లవి ప్రస్తుతం సౌత్ లో మంచి అవకాశాలతో దూసుకుపోతోంది. సూర్య ఎన్ జి కె చిత్రంలో సాయి పల్లవి నటిస్తోంది. ఈ చిత్రంతో పాటు మరో మలయాళం చిత్రంలో కూడా సాయి పల్లవి నటిస్తోంది.ఈమద్యే ఒక ఇంటర్యూలో తనకు ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని అసలు పెళ్లి చేసుకుంటానో లేదో కూడా తెలియదని చెప్పింది.మరి ఇప్పటికైనా ఇలాంటి గాలివార్తలకు పులుస్టాప్ పెడతారో లేదో చూడాలి. మరి సాయిపల్లవి విజయ్ పెళ్లి చేసుకుంటున్నారని వస్తున్న ఈ రూమర్స్ గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.