100 కోట్లిచ్చినా ఆ క్యారెక్టర్ చెయ్యను.. సాయిపల్లవి

531

సాయి పల్లవి..ఒక్క సినిమాతో మారుమోగిపోయిన పేరు.ఫిదా అనే ఒక్క సినిమాతో టాలీవుడ్ లో మంచి నటి అనే పేరు తెచ్చుకుంది.అయితే అందరి హీరోయిన్స్ లా కాకుండా కొత్త పాత్రలు చేస్తూ అందరి అభిమానాన్ని దక్కించుకుంది.అయితే ఇప్పుడు సాయి పల్లవి ఒక బడా హీరో సినిమా అవకాశాన్ని వదులుకుందంట.దానికి కారణం ఆ సినిమాలో ఆమె మెయిన్ హీరోయిన్ కాదు సెకండ్ హీరోయిన్.

Related image

భారీగా పారితోషికం ఇస్తామంటే ఐటెం సాంగ్స్ చేసేందుకు సిద్ధమవుతున్నారు కొందరు బడా హీరోయిన్లు. అయితే సాయిపల్లవి మాత్రం డబుల్ రెమ్యునరేషన్ ఇస్తామన్నా ఐటం సాంగ్స్ చెయ్యడానికి సెకండ్ హీరోయిన్ గా చెయ్యడానికి ఒప్పుకోవడం లేదట. ఒక యువహీరో సినిమాను రిజెక్ట్స్ చేసిందట సాయిపల్లవి.మనీ కాదు గోల్ ముఖ్యమంటోంది సాయిపల్లవి. మిగిలిన హీరోయిన్లకు తాను పూర్తి భిన్నమని చెబుతోంది. రెండు కోట్ల రూపాయల పారితోషికం ఇచ్చినా రోల్ నచ్చడం లేదని తిరస్కరించిందట.

Related image

బెల్లంకొండ సాయిశ్రీనివాస్ సినిమాలో మొదటి హీరోయిన్‌గా కాజల్ నటిస్తోంది. ఈ సినిమాలో రెండవ హీరోయిన్ పాత్ర కోసం పలువురు భామలను పరిశీలించారు. కానీ ఫిదా హీరోయిన్ సినిమాలో నటిస్తే బాగుంటుందని హీరో భావించారు.యూత్‌లో క్రేజ్ ఉన్న సాయిపల్లవిని రెండో హీరోయిన్‌గా తీసుకుంటే బాగుంటుందని అందరూ భావించారు. ఇదే విషయాన్ని అడిగితే సాయిపల్లవి ఒప్పుకోలేదట. తనకు ప్రాధాన్యత లేని క్యారెక్టర్ ఇస్తే అస్సలు ఇష్టం లేదని, 100 కోట్లు ఇచ్చినా ఆ క్యారెక్టర్ చేయనని ముఖంమీదే చెప్పేసిందట సాయిపల్లవి. ఇప్పుడు ఇదే విషయం తెలుగు సినీపరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారుతోంది.