రెండు కోట్ల ఆఫ‌ర్ వ‌ద్ద‌ని చెప్పిన సాయిప‌ల్ల‌వి

419

సాయి ప‌ల్ల‌వి పేరు చెప్ప‌గానే ఫిదా సినిమా గుర్తువ‌స్తుంది.. ఆమె చేసిన సినిమాల్లో ఈ సినిమాకు ఎంతో పేరు వ‌చ్చింది.. తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా క‌నెక్ట్ అయింది.. అయితే ఎప్పుడు హీరోల‌తో ఆమెకు కాస్త వివాదాలు షూటింగ్ స‌మ‌యంలో వ‌స్తాయి అని వార్త‌లు వైర‌ల్ అవుతున్నా అదంతా దుష్ర‌చారం అనే వెర్ష‌న్ కూడా వినిపిస్తోంది. ఇక ఆమెతో చేసే హీరోకు కూడా అదే విధంగా క్రేజ్ ఉంటేనే ఆమె సినిమాల్లో న‌టిస్తుందని, క‌థ కూడా న‌చ్చాలి అని కొంద‌రు టాలీవుడ్ లో అంటూ ఉంటారు.

Image result for sai pallavi

ఈమె. ఎన్ని కోట్లిచ్చినా ఎంత పెద్ద హీరో అయినా స్ర్కిప్ట్ నచ్చనిదే నటించను గాక నటించనంటోంద‌ట‌ . తాజాగా ఓ కొత్త సినిమా ఆఫ‌ర్ వ‌ద్ద‌ని ప‌క్క‌న పెట్టేసింద‌ట సాయిపల్ల‌వి …సాయి ప‌ల్ల‌వికి ఈ సినిమాలో న‌టిస్తే రెండు కోట్లు ఇస్తామ‌ని ఆఫ‌ర్ ఇచ్చార‌ట‌….బెల్లంకొండ సాయిశ్రీనివాస్ గత కొంతకాలంగా టాలీవుడ్‌లో హీరోగా నిలదొక్కుకోవడానికి తీవ్రంగా కృషి చేస్తున్నాడు. ఆయ‌ప తాజా సినిమాలో ఆమెని హీరోయిన్ గా తీసుకోవాలి అని భావించారు. కాని ఆమె న‌టించేందుకు నో చెప్పిందట‌.

Related image

అయితే బెల్లంకొండ సాయిశ్రీనివాస్ తో ఇప్ప‌టికే టాలీవుడ్ టాప్ హీరోయిన్లు అయిన సమంత, తమన్నా, రకుల్ ప్రీత్‌సింగ్‌లాంటి హీరోయిన్స్ నటించారు అలాగే కాజ‌ల్ కూడా న‌టించ‌డానికి ఎస్ చెప్పింది…ఈ సమ‌యంలో సాయిప‌ల్ల‌వి నో చెప్ప‌డం పై టాలీవుడ్ లో పెద్ద చ‌ర్చ జ‌రుగుతోంది….త‌న‌కు క‌థ త‌న పాత్ర న‌చ్చాలి అని పారితోషికం ముఖ్యం కాదు అని చెబుతోంది సాయిప‌ల్ల‌వి.