హీరోల‌తో గొడ‌వల‌పై క్లారిటీ ఇచ్చిన ఫిదా బ్యూటీ

970

ఫిదా సినిమా చెప్ప‌గానే వ‌రుణ్, శేఖ‌ర్ క‌మ్ముల కంటే ముందు గుర్తువ‌చ్చేది సాయిప‌ల్లవి.. త‌న న‌ట‌న‌తో అంత క్యూట్ గా సినిమాకి అందం తెచ్చింది… పర్టిక్యుల‌ర్ గా ఆమె వాయిస్ తెలంగాణ యాస‌తో అద‌ర‌గొట్టింది.. అంద‌రి మ‌న‌సుల్లో మంచిస్ధానం సంపాదించుకుంది ఈ ప‌ల్ల‌వి.
ఈ సినిమా తరువాత నాని తో కలిసి మిడిల్ క్లాస్ అబ్బాయ్ అనే చిత్రంలో నటిచింది. ఈచిత్రం కూడా మంచి విజయాన్ని సాధించింది.

Image result for sai pallavi

ఇక సాయి ప‌ల్ల‌వి మంచి డ్యాన్స‌ర్ అనే విష‌యం తెలిసిందే… హీరోల‌కు పోటీగా త‌న స్టెప్పులతో ర్యాంపుపై అద‌ర‌గొడుతుంది.. ఇక నానితో సాయిప‌ల్ల‌వికి గొడ‌వ‌లు జ‌రిగాయి అని అనేక‌వార్త‌లు గ‌తంలో వినిపించాయి.. ఇక త‌ర్వాత క‌ణం సినిమా చేసింది సాయిప‌ల్ల‌వి.. ఈ చిత్రంలో కూడా హీరో నాగ‌సౌర్య‌తో ఆమెకు గొడ‌వ‌లు అయ్యాయి అని వార్త‌లు వ‌చ్చాయి. ఈ విషయాన్ని నాగశౌర్య కూడా ఒప్పుకున్నాడు.

Image result for sai pallavi

ఇక తాజాగా ఆమె మ‌రో హీరోతో గొడ‌వ‌కు దిగారు అనే వార్తలు వ‌స్తున్నాయి.. ఆమె ప్ర‌స్తుతం శ‌ర్వానంద్ తో జోడిగా ప‌డిప‌డిలేచె మ‌న‌సు సినిమాలో న‌టిస్తున్నారు ఈ సినిమా షూటింగ్ సంద‌ర్బంగా శ‌ర్వానంద్ కు అలాగే సాయిప‌ల్ల‌వికి గొడ‌వ జ‌రిగింది అని వార్త‌లు వ‌స్తున్నాయి.. దీంతో అత‌ను షూటింగ్ నిలిపివేసి వెళ్లిపోయాడ‌ట ఇది ఆ వార్త‌ల సారాంశం.. అయితే దీనిపై సాయి ప‌ల్ల‌వి క్లారిటీ ఇచ్చింది.. శ‌ర్వాకు నాకు ఏ గొడ‌వ జ‌ర‌గ‌లేదు ఆయ‌న వేరే సినిమా కూడా చేయ‌డంతో కాస్త బ్రేక్ ఇచ్చి ఆ సినిమా షూటింగ్ లో పాల్గొన్నారు అని తెలిపింది సాయి ప‌ల్ల‌వి.