మళ్ళి జత కట్టిన సాయి పల్లవి శేఖర్ కమ్ముల..

359

తెలుగు ఇండస్ట్రీలోకి ఫిదా సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ సాయి పల్లవి.ఈ సినిమాకు శేఖర్ కమ్ముల దర్శకుడిగా వ్యవహరించాడు.అయితే వీళ్ళిద్దరి కాంబినేషన్ లో మరొక చిత్రం రాబోతుంది.తనను తెలుగు ప్రేక్షకులు ఎప్పటికి మరచిపోకుండా ఫిదా చేయించిన దర్శకుడు శేఖర్ కమ్ముల కోసం మరో సినిమా ఒప్పుకుందట సాయి పల్లవి.

ఫిదా సినిమాలో నటించిన సాయి పల్లవిని తెలుగు ప్రేక్షకులు తమ ఇంటి అమ్మాయిగా ఫిక్స్ అయ్యారు . తాజగా మరోసారి శేఖర్ కమ్ముల తో సినిమా చేసేందుకు ఓకే చెప్పిందట. ప్రస్తుతం శేఖర్ కమ్ముల తమిళ క్రేజీ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా ఓ తెలుగు సినిమా చేసేందుకు సిద్ధం అవుతున్నాడు. ఈ నేపథ్యంలో ధృవ్ ని తెలుగు తెరకు పరిచయం అవుతున్న సినిమాలో సాయి పల్లవిని హీరోయిన్ గా ఎంపిక చేశారట.

 

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే నెలలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఇప్పటికే ధృవ్ తెలుగు అర్జున్ రెడ్డి రీమేక్ ని తమిళంలో చేస్తున్న విషయం తెలిసిందే. అన్నట్టు ఈ చిత్రాన్ని శేఖర్ కమ్ముల తన సొంత బ్యానర్ లోనే నిర్మిస్తాడట.మరి శేఖర్ కమ్ముల ఈ సినిమాలో సాయి పల్లవిని ఎలా చూపిస్తాడో చూడాలి.