మెగా మేనల్లుడి షాకింగ్ డెసిషన్.. సినిమాలకు బ్రేక్..

477

మెగా మేనల్లుడిగా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టాడు సాయి ధరమ్ తేజ్.అటు మెగాస్టార్, ఇటు పవర్ స్టార్ పోలికలతో, అదేవిధంగా నటన డాన్స్ లలో ఉత్సాహం కనిపించడంతో మెగా ఫ్యామిలీ నుంచి మరో స్టార్ వచ్చాడని అంతా అనుకున్నారు.

సుప్రీం చిత్రం వరకు తేజు అడుగులు అలాగే పడ్డాయి. ఆ తరువాత కథల ఎంపిక సరిగా లేకపోవడంతో తేజు సినిమాలు వరుసగా పరాజయం చెందుతూ వచ్చాయి.ఇంటలిజెంట్ జవాన్ విన్నర్ తేజ్ మూవీస్ వరుసగా ప్లాప్ అయ్యాయి.దీంతో కథల ఎంపిక విషయంలో పరిణితి ప్రదర్శించాలని సినీ విమర్శలకుల సూచించారు.

సాయిధరమ్ తేజ్ వరుస ప్లాపుల నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల పాటు సినిమాలకు బ్రేక్ ఇవ్వాలని తేజు భావిస్తున్నాడట. ఆలస్యంగా అయినా ఈ సారి పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.