మెగా మేనల్లుడి ‘చిత్రలహరి’విడుదల తేదీ ప్రకటన

308

మెగా మేనల్లుడిగా టాలీవుడ్‌కు పరిచయం అయిన యంగ్ హీరో సాయిధరమ్‌ తేజ్‌. కెరీర్‌ స్టార్టింగ్‌లో మంచి ఫాంలో కనిపించిన ఈ యంగ్‌ హీరో తరువాత తడబడ్డాడు. ముందు వరుస హిట్స్ వచ్చినా ఆ తర్వాత వరుస ఫ్లాప్‌లతో కెరీర్‌ను కష్టాల్లో పడేసుకున్నాడు. ముఖ్యంగా నక్షత్రం, జవాన్‌, ఇంటిలిజెంట్‌, తేజ్‌ ఐ లవ్‌యు సినిమాల్లో సాయి లుక్‌పై కూడా విమర్శలు వచ్చాయి.దీంతో తేజ్‌ తదుపరి చిత్రాన్ని ప్రారంభించడానికి గ్యాప్‌ తీసుకున్నాడు.

Image result for chitralahari movie release date

ప్రస్తుతం చిత్రలహరి అనే చిత్రం చేస్తున్నాడు. కిశోర్‌ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. కల్యాణి ప్రియదర్శన్‌, నివేదా పెతురాజ్‌ నాయికలు. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్నారు.దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్‌ జరుగుతోంది.అయితే ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 12న విడుదల చేయనున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది.

Image result for chitralahari movie release date

నిర్మాతలు నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌ (సి.వి.యమ్‌) మాట్లాడుతూ ‘‘అనుకున్న ప్రకారం షూటింగ్‌ సాఫీగా జరుగుతోంది. అన్ని పనులు పూర్తి చేసి ఏప్రిల్‌ 12న చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని చెప్పారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఫీల్‌ గుడ్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. టైటిల్‌లో అయిదు అక్షరాలు ఉన్నట్టు సినిమాలోనూ ఐదు పాత్రలకు ప్రాధాన్యం ఎక్కువగా ఉంటుంది. కథ ఈ ప్రధాన పాత్రల చుట్టూ తిరుగుతుంటుంది. సాయిధరమ్‌తేజ్‌ కెరీర్‌లో మంచి సినిమా అవుతంది’’ అని చెప్పారు.