రొమేనియా కు సాహో టీం

408

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తున్న తాజా చిత్రం సాహూ ఈ సినిమా షూటింగ్ అవుట్ డోర్ లో విదేశాల‌లో శ‌ర‌వేగంగా జ‌రిగింది..ఇప్ప‌టికే ఈ సినిమాకు సంబంధించి ఎటువంటి వార్త‌ల‌ను చిత్ర యూనిట్ బ‌య‌ట‌కు రివీల్ చేయ‌డం లేదు..భారీ బడ్జెట్ చిత్రం సాహో గురించి చిన్న విష‌యం వ‌స్తుందా అని చూస్తున్న అభిమానుల‌కు ఎటువంటి వార్త ఈ సినిమా చిత్ర యూనిట్ అందిచ‌డం లేదు.

Image result for sahoo team

విదేశాల‌లో షూటింగ్ పూర్తి చేసుకుని ప్ర‌స్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్ర యూనిట్.. తాజాగా కొత్త ప్ర‌దేశానికి వెళ్లాలి అని నిర్ణ‌యించుకున్నారు అని తెలుస్తోంది.. ఈ షెడ్యూల్ త‌ర్వాత వారు రోమెనియా వెళ్ల‌నున్నార‌ట… ఈ సినిమాకు సంబంధించి యాక్ష‌న్ సీక్వెల్స్ అక్క‌డ చిత్రీక‌రించ‌నున్నారు అని తెలుస్తోంది.

Image result for sahoo team

ఇక ఈ షెడ్యూల్ షూటింగ్ పూర్తి అయిపోతే ఈ సినిమా షూటింగ్ పూర్తి అవుతుంది అని అంటున్నారు.. ఈ సినిమాలో ప్ర‌భాస్ స‌ర‌స‌న బాలీవుడ్ న‌టి శ్ర‌ద్దా క‌పూర్ న‌టిస్తున్నారు.. ఇక ఈ సినిమాని ర‌న్ రాజా ర‌న్ ఫేమ్ సుజిత్ తెర‌కెక్కిస్తున్నారు.. ఈ సినిమాని యువి క్రియేష‌న్స్ నిర్మిస్తోంది.. ఈ చిత్రం 2019 వేస‌విలో విడుద‌ల కానుంది.