పొట్టి పొట్టి బట్టలు వేసుకునే హీరోయిన్స్ మీద సంచలన కామెంట్స్ చేసిన ఎస్.పి.బాలు..ఏమన్నాడో తెలిస్తే షాక్..

346

ఎస్పీ బాల‌సుబ్ర‌మ‌ణ్యం అంటే తెలియ‌ని తెలుగు ప్రేక్ష‌కుడు ఉండ‌డేమో.. ఆయ‌న‌కు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం కూడా అవ‌స‌రం లేదు. అయితే ఇప్పుడు ఈయ‌న కేవ‌లం గానం మాత్ర‌మే కాకుండా కారాలు మిరియాలు కూడా నూరుతున్నాడు. తెలుగు భాష‌పై ఆయ‌న‌కు ఉన్న ప‌ట్టు గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. వీలు దొరికిన ప్ర‌తీసారి కూడా భాష‌ను అవ‌మానిస్తున్న వాళ్ల‌పై ఫైర్ అవుతుంటాడు బాలు. ఇప్పుడు కూడా ఇదే జ‌రుగుతుంది. తెలుగు భాష‌ను అవ‌మానిస్తున్న వాళ్ల‌ను మ‌రో స్థాయిలో ఆడుకుంటున్నాడు బాలు. వాళ్ల‌ను విమ‌ర్శిస్తున్నాడిప్పుడు.ముఖ్యంగా హీరోయిన్ల‌ను టార్గెట్ చేసాడు బాల‌సుబ్ర‌మ‌ణ్యం. ఇప్ప‌టి త‌రం హీరోయిన్ల‌ను చూస్తుంటే ఒళ్లు మండిపోతుందంటూ చివాట్లు పెట్టాడు బాలు.

Image result for SP BALU

తెలుగు సినిమాల్లో నటించే ఇతర రాష్ట్ర హీరోయిన్ల పై సంచలన కామెంట్స్ చేసారు. అంగాంగ ప్రదర్శన చేస్తేనే అవకాశాలు వస్తాయా.? అవకాశాల కోసం ఓ స్త్రీ పాత్రధారి ఇంత దిగజారిపోవాలా.? అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.గతంలోనూ సినిమాలు వచ్చేవని, కానీ హీరోయిన్లు మరీ ఇంత దిగజారి నటించలేదని, కానీ ఇప్పుడు స్త్రీ జాతి సిగ్గు పడేలా తెరపై స్త్రీ పాత్రధారుల వస్త్రధారణ ఉంటోందనీ, ఇలా స్పందించినందుకు హీరోయిన్లు తనని తిట్టినా ఫర్వాలేదన్నారు బాలు.ఈ క్రమంలో తప్పంతా హీరోయిన్లదే అని కూడా అనలేము..ఓ కథానాయిక తెరపై ఎలా కనిపించాలన్నది దర్శకుడి అభిరుచిని బట్టి ఉంటుంది. ఒక్కో దర్శకుడి ఫ్రేములో హీరోయిన్లు ఒక్కోలా కనిపిస్తారు. ఓ సినిమాలో సంప్రదాయ దుస్తుల్లో అలరించిన నాయిక, మరో సినిమాలో గ్లామర్ పాత్రలో హల్ చల్ చేస్తుంది.

ఇలాంటి దుస్తులు నేను వేసుకోను అని చెప్పే హక్కు మాత్రం కథానాయికకు ఉంది. కానీ అంత ధైర్యం ఎవరికీ లేదు. ఎందుకంటే అలా అంటే తర్వాత సినిమా అవకాశాలు రావు. ఈ విషయంలో కేవలం కథానాయికల్ని నిందించాల్సిన పనిలేదు. దర్శకులకూ ఇందులో వాటా ఉంది.పొట్టి బ‌ట్ట‌లు వేసుకుంటున్న వాళ్ల‌కే వాళ్లు కూడా అవ‌కాశాలు ఇస్తారా అంటూ నిల‌దీస్తున్నాడు బాలు. పాశ్చాత్య సినిమాల‌కు అల‌వాటు ప‌డిపోయి వాళ్లు ఫాలో అవుతుంటే తెలుగు సినిమా స్థాయి దిగ‌జారిపోయింది..వాళ్లు బాత్రూమ్‌లో చేసుకునే ప‌నులు కూడా మ‌నం చూపిస్తామా అంటూ ప్ర‌శిస్తున్నాడు. ఎవ‌రేమ‌నుకున్నా కూడా త‌న‌కు అనిపించింది మాట్లాడ‌తానంటున్నాడు బాలు. త‌న‌లాంటి వాళ్లు కూడా మౌనంగా ఉంటే తెలుగు సినిమా స్థాయి మ‌రింత ప‌డిపోతుంద‌ని నోరు విప్పాను అంటున్నాడు ఈయ‌న‌. మొత్తానికి బాలు వ్యాఖ్య‌లు ఇప్పుడు తెలుగు ఇండ‌స్ట్రీలో స‌రికొత్త చ‌ర్చ‌కు దారి తీస్తున్నాయి.మరి బాలు వ్యాఖ్యల మీద ఎవరు ఎలా స్పందిస్తారో చూడాలి. మరి ఈ విషయం గురించి మీరేమంటారు. sp బాలు హీరోయిన్స్ మీద చేసిన ఈ వ్యాఖ్యల గురించి అలాగే పొట్టిపొట్టి బట్టల వేసుకునే హీరోయిన్స్ గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.