RX 100 సినిమా దర్శకుడితో నితిన్ సినిమా..సినిమా మొత్తం ముద్దులే ముద్దులంటా..

395

‘ఆర్ఎక్స్ 100’ సినిమా విడుదల తర్వాత దర్శకుడు అజయ్ భూపతికి అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. తక్కువ బడ్జెట్లో చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించడంతో ఈ దర్శకుడికి డిమాండ్ ఏర్పడింది. తొలి సినిమాలో రొమాంటిక్ సీన్లను అతడు హ్యాండిల్ చేసిన విధానం బోల్డ్ సీన్లను పచ్చిగా ప్రజంట్ చేస్తూనే అసభ్యత లేకుండా తెరపై చూపించిన అతడి టాలెంట్‌ను అందరూ అభినందిస్తున్నారు.

తాజా సమాచారం ప్రకారం అజయ్ భూపతి తన రెండో సినిమాను హీరో నితిన్‌తో చేయబోతున్నట్లు సమాచారం.హీరో నితిన్ అజయ్ భూపతితో ఇప్పటికే సంప్రదింపులు జరిపాడని, నితిన్ బాడీ లాంగ్వేజ్‌కు సూటయ్యే కథ కూడా ఉండటంతో డీల్ ఓకే అయినట్లు తెలుస్తోంది.తన రెండో సినిమాలోనూ ముద్దు సీన్లు, రొమాంటిన్ సన్నివేశాలు తప్పకుండా ఉండేలా అజయ్ భూపతి ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

హీరో నితిన్ ఇప్పటి వరకు తన సినిమాల్లో ఘాటైన లిప్ లాక్ ముద్దు సీన్లు చేయలేదు.అజయ్ భూపతితో చేయబోయే సినిమాలో ముద్దు సీన్లు చేయబోతున్నాడా? అనేది హాట్ టాపిక్ అయింది.ప్రస్తుతం నితిన్ శ్రీనివాస కళ్యాణం మూవీలో బిజీ బిజీగా ఉన్నాడు.ఈ సినిమా అయిపోయాకా ఆ సినిమా విషయం గురించి బయటపెత్తవచ్చు అని అనుకుంటున్నారు.