ఆర్ఎక్స్ 100 ముద్దుగుమ్మకు మరొక అవకాశం..

324

‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో కుర్రకారు గుండెలు కొల్లగొట్టిన పంజాబీ ముద్దుగుమ్మ పాయల్ రాజ్‌పుత్.ముద్దులు పెట్టి కుర్రకారు మొత్తాన్ని తన అభిమానులుగా మార్చుకుంది.అయితే ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ మరో చిత్రంతో అలరించేందుకు సిద్ధమవుతోంది.‘ఆర్‌ఎక్స్ 100’ సినిమా సూపర్ హిట్ తర్వాత పాయల్‌ను మంచి ఆఫర్లే వరించాయి.

rx 100 movie కోసం చిత్ర ఫలితం

ఒక పెద్ద హీరో సినిమాలో ఆమెకు ప్రత్యేక గీతంలో నటించేందుకు అవకాశం వచ్చింది.అయితే, తొందరపడకుండా ఆచుతూచి ఆమె సినిమాలను ఎంపిక చేసుకుంటోంది.ఈ నేపథ్యంలో ఆమె దర్శకుడు భాను శంకర్ సినిమాలో నటించేందుకు సంతకం చేసినట్లు తెలిసింది. ఇందులో ఆమెకు కొన్ని యాక్షన్ సన్నివేశాలు కూడా ఉండనున్నాయని తెలిసింది.

సంబంధిత చిత్రం

అయితే, ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ సినిమాలోను ఈమెకు అవకాశం వచ్చినా ముందుగా భానుశంకర్ సినిమాలో నటించేందుకే ఆమె ఆసక్తి చూపినట్లు సమాచారం. ఈ సినిమా షూటింగ్ ఈ నెలలోనే ప్రారంభం కానుంది.