కాంప్రమైజ్ అయితే అవకాశం ఇస్తా అన్నాడు..పాయల్ రాజ్ పూత్

420

సినిమా ప‌రిశ్ర‌మ‌లో హీరోయిన్లు ఎదుర్కొనే కాస్టింగ్ కోచ్ గురించి ఇటీవ‌లి కాలంలో పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. సినిమా అవ‌కాశాల కోసం ప్ర‌య‌త్నించే అమ్మాయిలకు ఇలాంటి అనుభ‌వాలు ఎదుర‌వుతున్నాయి.దీని గురించి ఇప్పటివరకు చాలా మందే మాట్లాడారు.అయితే ఇటీవ‌ల విడుద‌లై సంచ‌ల‌నం విజ‌యం సాధించిన `ఆర్ఎక్స్ 100` సినిమా హీరోయిన్ పాయ‌ల్ రాజ్‌పుత్‌ కూడా ఇప్పుడు ఈ విషయం గురించి నోరు విప్పింది.

7

తనకు కూడా కాస్టింగ్ కోచ్ అనుభవం ఎదురైంది అని చెప్పింది.తనకు నాలుగు రోజుల కింద‌ట కాస్టింగ్ కౌచ్ అనుభ‌వం ఎదురైంద‌ట‌.ఈ విష‌యాన్ని ఆమె స్వ‌యంగా ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పింది.`నాకు క‌థ న‌చ్చితే సినిమా కోసం ఏమైనా చేస్తాను. కానీ, బ‌య‌ట మాత్రం కాదు. సినిమాలో అన్ని ముద్దులు పెట్టాన‌ని బ‌య‌ట కూడా ముద్దులు పెడ‌తాన‌ని అనుకుంటున్నారా? నా తొలి సినిమా చూసి నా గురించి ఏదేదో ఊహించుకుంటున్న‌ట్టున్నారు. విజ‌య‌వంత‌మైన సినిమాలో న‌టించిన త‌ర్వాత కూడా నాకు కాస్టింగ్ కౌచ్ అనుభ‌వం ఎదురైంది.

12

నాల్రోజుల క్రితం ఒక‌రు ఫోన్ చేసి `కాంప్ర‌మైజ్‌` అయితే అవ‌కాశం ఇస్తాన‌ని చెప్పాడు. నేను టాలెంట్‌తోనే ఇంత దూరం వ‌చ్చాను త‌ప్ప‌ కాంప్ర‌మైజ్ అయి కాదని అతడిని బండ బూతులు తిట్టాను` అని పాయ‌ల్ చెప్పింది.