రష్మి తొడలు చూసి నన్ను నేనే మర్చిపోయా…RX100 డైరెక్టర్ అజయ్ భూపతి

523

జై, రష్మి గౌతమ్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘అంతకు మించి’.జానీ దర్శకత్వంలో యూ అండ్ ఐ ఎంటర్‌టైన్మెంట్స్ సమర్పణలో ఎస్.జై. ఫిలిమ్స్ పతాకంపై సతీష్, ఎ.పద్మనాభరెడ్డి నిర్మించారు. ఈ మూవీ విడుదలవుతున్న నేపథ్యంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి RX100 దర్శకుడు అజయ్ భూపతి గెస్ట్ హాజరై సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు.

 

ఈ సందర్భంగా అజయ్ భూపతి మాట్లాడుతూ రష్మి అందంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.‘అంతకుమించి’ ట్రైలర్ చూశాను. అందులో నాకు బాగా నచ్చింది రొమాంటిక్ షాట్స్. అవంటే నాకు చాలా ఇష్టం. గతంలో మేము ఫిలింనగర్ ఛాంబర్ దగ్గర ‘ఆర్ఎక్స్ 100′ హోర్డింగ్ వేశాం. మా హోర్డింగ్ పక్కన చాలా రోజులు ఏ హోర్డింగ్స్ పెట్టలేదు. సడెన్‌గా ఒక హోర్డింగ్ వచ్చింది. రష్మిగారి తొడలు, సముద్రం బీచ్‌తో కూడి ఆ హోర్డింగ్ చూస్తే నా సినిమా హోర్డింగ్ గురించి మరిచిపోయాను. ఇది నేను ఒక ఆడియన్‌గా చెబుతున్నాను. రేపు మీరు కూడా నాలాగే కనెక్ట్ అవుతారు.

ఆగస్టు 24న సినిమా విడుదలవుతోంది. అందరూ తప్పకుండా చూడాలి. రొమాంటిక్ షాట్స్ అనేవి సినిమాలో భాగం. నా సినిమాలో అయినా ‘అంతకుమించి’ సినిమాలో అయినా కేవలం అవి ఉంటే సినిమా హిట్ అయిపోదు. అంతకుమించి కంటెంట్ ఉండాలి, స్టోరీ స్ట్రాంగ్‌గా ఉన్నపుడే సినిమాలు ఆడతాయి అని అజయ్ భూపతి అన్నారు.అయితే ఇతని వ్యాఖ్యలకు రశ్మి ఎలాంటి సీరియస్ కాకుండా ఫన్నిగా తీసుకుంది.అజయ్ భూపతి కామెంట్లపై రష్మి రియాక్ట్ అవుతూ మా సినిమా క్రాష్ ప్రమోషన్స్ చేయడంతో పాటు పోస్టర్‌తో కనెక్ట్ అయినందుకు థాంక్స్. మీ ప్రశంసలు ఎప్పటికీ మరిచిపోలేను అంటూ సమాధానం ఇచ్చింది.