బాహుబలి రికార్డ్స్ ని తిరగరాసిన RX 100..

535

చిన్న సినిమాలలో పెద్ద విజయం సాదించిన సినిమాలలో RX 100 ఒకటి.అర్జున్ రెడ్డి తర్వాత యా రేంజ్ లో యువతను ఆకట్టుకున్న సినిమా RX 100.ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా నడుస్తుంది.అయితే ఈ సినిమా ఇప్పుడు ఏకంగా బాహుబలి రికార్డ్స్ నే బద్దలు కొట్టింది.బాహుబలి రికార్డ్స్ ను బద్దలు కొట్టడం ఏమిటి అనుకుంటున్నారా..

ఆర్టిసి క్రాస్ రోడ్స్ లో దేవి థియేటర్ లో మొదటి వారం కలక్షన్స్ లో ఆరెక్స్ 100 బాహుబలి-2 వసూళ్లను సైతం అధిగమించడం విశేషం.ఆర్టిసి క్రాస్ రోడ్స్ లో గల దేవి థియేటర్ లో మొదటి వారంలో ఇప్పటి వరకు బాహుబలి-2 28,82,370 లక్షలు వసూలు చేసింది. ఆ తర్వాత సెకండ్ ప్లేస్ లో వరుణ్ తేజ్ తొలిప్రేమ 28,67,362 లక్షలు వసూళు చేసి సెకండ్ ప్లేస్ లో ఉంది.

ఆరెక్స్ 100 మూవీ ఈ రెండు సినిమాలను బీట్ చేసి ఏకంగా 29, 32, 867 గ్రాస్ కలెక్ట్ చేయడం విశేషం.అసలేమాత్రం అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా బాహుబలి లాంటి భారీ సినిమా రికార్డులను బీట్ చేయడం అంటే ఇది మాములు విషయం కాదు.