ప్రారంభమైన ‘RRR’ సెకండ్ షెడ్యూల్.. ఇండియాలోనే తొలిసారి… హైటెక్నాలజీతో

204

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కబోతున్న మల్టీస్టారర్ మూవీ రెడీ అయ్యింది. బాహుబలి తర్వాత ఆ స్థాయికి తగిన విధంగా సినిమా ప్లాన్ చేసిన రాజమౌళి ఎన్టీఆర్, రామ్ చరణ్‌ కలయికతో రేర్ కాంబినేషన్ సెట్ చేశారు. మెగా, నందమూరి అభిమానుల సపోర్టుతో ఈ సినిమా ఏ స్థాయికి వెళుతుందో ఎవరూ ఊహించలేక పోతున్నారు.రాజమౌళి లాంటి బడా దర్శకుడి చిత్రంలో ఎన్టీఆర్, రాంచరణ్ నటిస్తుండడంతో ఈ చిత్రం సౌత్ లోనే క్రేజీ మల్టీస్టారర్ గా మారిపోయింది. బాహుబలి చిత్రాన్ని మించేలా 300 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ చిత్రానికి సంబంధించిన మొదటి షెడ్యూల్ నవంబర్‌లో మొదలై డిసెంబర్ ప్రథమార్థంలో పూర్తైంది.అనంతరం రాజమౌళి తనయుడి వివాహం కారణంగా కాస్త గ్యాప్ తీసుకున్న ఈ చిత్రబృందం నేడు(సోమవారం) సెకండ్ షెడ్యూల్‌ను ప్రారంభించింది.తొలి షెడ్యూల్ తర్వాత కాస్త విరామం తీసుకొని మళ్లీ సెట్స్‌పైకి వచ్చాం. రెండో షెడ్యూల్ సోమవారం మొదలైంది అని RRR మూవీ అధికారిక ట్విట్టర్ అకౌంట్‌ ద్వారా తెలిపారు. ఈ రోజు షూటింగ్‌‌లో రాంచరణ్, ఎన్టీఆర్ పాల్గొనగా భారీ సన్నివేశాలను చిత్రీకరించినట్టు సమాచారం.

ఇదిలా ఉండగా, RRR సినిమాటోగ్రాఫర్ కేకే సెంథిల్ కుమార్ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. భారత్‌లోనే తొలిసారిగా అర్రి అలెక్సా ఎల్ఎఫ్, అర్రి సిగ్నేచర్ ప్రైమ్ లెన్స్ షూట్ చేస్తున్నాం అని సెంథిల్ ట్వీట్‌లో పేర్కొన్నారు. అలాగే కెమెరాకు ఫోజిచ్చిన ఫొటోలను ఆయన ట్విట్టర్‌లో షేర్ చేశారు.