రోబో2 టీజర్ డేట్ ఫిక్స్ అయిన‌ట్టేనా

744

రోబో 2 సినిమా షూటింగ్ పూర్తి అయిపోయింది… ఇక పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ లు జ‌రుగుతున్నాయి.. అయితే వీఎఫ్ ఎక్స్ వ‌ర్క్ లు లేట్ కావ‌డంతో ఇక ఈ సినిమా విడుద‌ల మ‌రింత లేట్ అయింది…. ఈ సినిమాని ద‌ర్శ‌కుడు శంక‌ర్ చాలా శ్ర‌మ‌తో ఎన్నోఏళ్లుగా తీశారు..

Image result for robot 2

సూపర్‌ స్టార్ రజనీకాంత్ హీరోగా బాలీవుడ్ స్టార్‌ హీరో అక్షయ్ కుమార్ విలన్ గా ఈ చిత్రంలో క‌నువిందు చేయ‌నున్నారు.. రోబో చూసిన త‌ర్వాత ఈ సినిమా పై మ‌రింత అంచ‌నాలు పెరిగిపోయాయి అభిమానుల‌కు.రోబో2.ఓ తెలుగు తమిళ ప్రేక్షకులతో పాటు హిందీ ప్రేక్షకులు కూడా ఈ చిత్రం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Image result for robot 2

ఈసినిమా దీపావ‌ళి లేదా డిసెంబ‌ర్ నెల‌లో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని చూస్తోంది చిత్ర‌యూనిట్. తాజాగా కోలీవుడ్ స‌మాచారం ప్ర‌కారం విజువ‌ల్ వండ‌ర్ గా తెర‌కెక్కుతున్న ఈసినిమా టీజ‌ర్ ఆగ‌స్ట్ 15 న గ్రాండ్ గా రిలీజ్ చేయ‌నున్నార‌ట‌.. ఈ విష‌యం ఇంకా బ‌య‌ట‌కు అనౌన్స్ చేయ‌లేదు చిత్ర‌బృందం. దీనిపై రెండు మూడు రోజుల్లో అధికారిక ప్ర‌క‌ట‌న విడుద‌ల కానుంది.