రోబో 2 o నాలుగురోజుల కలెక్షన్స్ చూస్తే దిమ్మతిరుగుతుంది

390

ఇండియన్ సూపర్‌స్టార్స్ రజనీకాంత్, అక్షయ్ కుమార్ కాంబినేషన్‌లో దర్శకుడు శంకర్ రూపొందించిన 2.0 చిత్రానికి భారీ స్పందన లభిస్తున్నది. తొలి రోజు దేశవ్యాప్తంగా టికెట్ కౌంటర్లు కిక్కిరిసిపోయి కనిపించాయి. రిలీజైన ప్రతీ చోట 95 శాతానికి పైగా అక్యుపెన్సీ ఉన్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. శంకర్ విజన్, ఆలోచనకు ప్రేక్షకులు నీరాజనం పడుతున్నారు. మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం మ్యాజిక్ చేసింది.మొదటిరోజు నుంచే కలెక్షన్ల వర్షం కురిపించింది.రిలీజ్ అయ్యి ఇప్పటికి నాలుగురోజులైంది. మరి ఈ నాలుగురోజులలో ఎంత రాబట్టిందో చూద్దామా.

Related image

2.0 చిత్రం ప్రపంచవ్యాప్తంగా 10500 స్క్రీన్లలో విడుదలైంది. ఉత్తర అమెరికాలో 850 స్క్రీన్లలో, యూకేలో 300, యూరప్‌లో 500, యూఏఈలో 350, దక్షిణాసియాలో 100, ఇండియాలో 7500, ఇతర ప్రాంతాల్లో 900 స్క్రీన్లలో రిలీజ్ అయింది. మొదటి రోజు 35 వేల షోలు ప్రదర్శించారు.. రిలీజైన ప్రతీ చోట మంచి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తున్నది. 2.0 చిత్రం బాహుబలి2 స్క్రీన్లను అధిగమించి కొత్త రికార్డును సొంతం చేసుకొన్నది. బాహుబలి చిత్రం ప్రపంచవ్యాప్తంగా 9000 స్క్రీన్లలో రిలీజై ప్రభంజనం సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా పలురికార్డులను తిరగరాసింది. ప్రస్తుతం 2.0 చిత్రం కూడా భారీగానే రిలీజైంది.అందుకు తగ్గట్టుగానే భారీ వసూలు సాధించింది. మొదటిరోజు 130 కోట్లు కలెక్ట్ చేసిన ఈ సినిమా బాహుబలి రికార్డ్స్ ను తిరగేస్తుంది అనుకున్నారు.కానీ మూడు నాలుగవరోజుల్లో అంతలా వసూళ్లు రాలేదు.

ఈ సినిమా నాలుగురోజుల కలెక్షన్స్ 450 నుంచి 500 కోట్ల మధ్యలో ఉంది.బాహుబలి రికార్డ్స్ ను బ్రేక్ చేస్తుంది అనుకున్నారు.అయితే బహుబలి 2 నాలుగు రోజుల్లో 600 కోట్లు కలెక్ట్ చేస్తే 2.ఓ 500 లోపే కలెక్ట్ చేసింది.దీనిని బట్టి చూస్తే ఈ సినిమా రికార్డ్ స్పృష్టించాలంటే ఇంకా భారీగా కలెక్షన్స్ కురిపించాలి.చూడాలి మరి బాహుబలి కలెక్షన్స్ ను తిరగరాస్తుందో లేదో. మరి ఈ విషయం గురించి మీరేమంటారు.2.ఓ నాలుగురోజుల కలెక్షన్స్ గురించి అలాగే బహుబలి2 రికార్డ్స్ ను తిరగేస్తుంది అని అనుకుంటున్నారా.మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.