రోబో 2 0 గురించి ఎవ్వరికీ తెలియని 8 విషయాలు

605

రజనీకాంత్ అభిమానులు మూడేళ్లుగా ఎదురు చూస్తున్న 2.0 చిత్రం నేడు విడుద‌ల అయింది. 2010లో వచ్చిన యంతిరన్ చిత్రానికి ఇది సీక్వెల్. అందులో హీరో, విలన్ పాత్రలు రెండూ రజనీ పోషించగా…. 2.0లో చిట్టి రోబోగా రజనీకాంత్, విలన్ పాత్రలో అక్షయ్ కుమార్ కనిపించారురు. సినిమా ఫ‌స్ట్ షో చూసిన వారు గ్రాఫిక్స్ వండ‌ర్ అని ర‌జ‌నీ పెట్టుకున్న ఆశ‌ల‌కు త‌గ్గ‌ట్లు న‌టించారు అని శంక‌ర్ మరో మ్యాజిక్ చేశాడు అని అంటున్నారు.

Image result for robo 2.0

ఇండియన్ సినీ చరిత్రలో తెరకెక్కిన బిగ్ బడ్జెట్ మూవీ ఇదే. రోబో చిట్టిని తెరపై ఎప్పుడు చూద్దామా? అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే సినిమా చూసే ముందు అభిమానులు ఈ మెగా మూవీ గురించిన కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోవాల్సిందే.యంతిరన్(రోబో)లో మాదిరిగా చిట్టి రూపంలోనే ఉండే విలన్ కాకుండా… ఈ సారి సరికొత్త విలన్‌ను దర్శకుడు శంకర్ రంగంలోకి దింపారు. ఈ పాత్రకు ముందు హాలీవుడ్ స్టార్ ఆర్నాల్డ్‌స్వార్జ్ నెగ్గర్ అనుకున్నప్పటికీ పలు కారణాలతో అది వర్కౌట్ కాలేదు. తర్వాత అమీర్ ఖాన్‌కు ఈ కథ చెప్పి విలన్ పాత్ర చేయాలని అడగాలనుకున్నారు కానీ ఆలోపే అనుకోకుండా అక్షయ్ కుమార్ కథ వినేసి చేయడానికి ఆసక్తి చూపడంతో ఆయన్నే ఫైనల్ చేశాడు శంకర్.

Image result for robo 2.0

అక్షయ్ ఈ చిత్రంలో డాక్టర్ రిచర్డ్స్ పాత్రలో క్రౌమ్యాన్‌గా కనిపించబోతున్నారు. రజనీకాంత్ అభిమానులకు 2018 డబుల్ డోస్ అని చెప్పక తప్పదు. 1995 తర్వాత రజనీకాంత్ సినిమాలు ఒకే ఏడాది రెండు విడుదల కావడం ఇదే తొలిసారి. ఈ ఏడాది జూన్లో రజనీ … పా రంజిత్ దర్శకత్వంలో చేసిన కాలా విడుదలైన సంగతి తెలిసిందే. 2014లో లింగా, కొచ్చాడియాన్ వచ్చినప్పటికీ కొచ్చాడియాన్‌లో రజనీకాంత్ కనిపించకుండా అతడి కార్టూన్ రూపం మాత్రమే కనిపింది కాబట్టి దాన్ని లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు.

Image result for robo 2.0

ఈ సినిమా కోసం దాదాపు రూ. 600 కోట్ల బడ్జెట్ ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. 3డి ఫార్మాట్లో తెరకెక్కించిన మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ ఇండియన్ మూవీ కూడా ఇదే….ఈ చిత్రాన్ని 2డిలో చిత్రీకరించి 3డిలోకి కన్వర్ట్ చేయడం కాకుండా నేరుగా 3డిలో చిత్రీకరించారు. దీని కోసం లేటెస్ట్ 3డి కెమెరా వాడారు. అందువల్ల సినిమా చూస్తున్న ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి కలుగుతుంది అని తెలిపారు. విజువల్ ఎఫెక్ట్స్ 2.0లో అత్యంత ప్రధానమైనవి .ఈ సినిమా కోసం 15కు పైగా వరల్డ్ లెవల్ విఎఫ్ఎక్స్ కంపెనీలు పని చేశాయి.

Related image

2150 వి.ఎఫ్‌.ఎక్స్ షాట్స్ ఉప‌యోగించారు. 3000 మంది వి.ఎఫ్‌.ఎక్స్ టెక్నీషియ‌న్స్.. 1000 టిపిక‌ల్ వి.ఎఫ్‌.ఎక్స్ షాట్ మేక‌ర్స్ ఈ సినిమా కోసం ప‌నిచేశారు. పూర్తిస్థాయి త్రీ డీ టెక్నాల‌జీతో.. 4డీ సౌండింగ్‌తో తెర‌కెక్కిన తొలి ఇండియ‌న్ సినిమా ఈ సినిమాలో అక్షయ్ కుమార్ మేకప్ కోసం చాలా కష్టపడాల్సి వచ్చింది. ఇందులో ఆయన్ను క్రౌమ్యాన్ లుక్‌లో కనిపించడానికి ప్రోస్తటిక్ మేకప్ వేశారు. ఈ మేకప్ కోసం అక్షయ్ కుమార్ ప్రతి రోజూ గంటల సమయం వెచ్చించారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

రజనీకాంత్-అక్షయ్ కుమార్ కలిసి నటిస్తున్న తొలి సినిమా ఇది. గతంలో రజనీకాంత్ నటించిన ‘చంద్రముఖి’ చిత్రం హిందీ రీమేక్‌ భూల్ భులయ్యాలో అక్షయ్ నటించారు. అయితే ఇద్దరూ ఒకే సినిమాలో నటించడం ఇదే తొలిసారి. బిజినెస్ రూపంలో అత్యధిక వసూలు చేసింది చిత్రంగా 2.0 మూవీ నిలిచింది. శాటిలైట్ రైట్స్, డిజిటల్ రైట్స్, థియేట్రికల్ రైట్స్ రూపంలో ఈ చిత్రానికి ఇప్పటికే రూ. 370కోట్లు వసూలు అయ్యాయి… మ‌రి చూశారుగా విడుద‌ల అయి రోబో స‌రికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు. మ‌రి ఈ సినిమా చూసిన వారు మీ అభిప్రాయాల‌ను కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.