‘2.O’మూవీ రివ్యూ & రేటింగ్..మీరు ఊహించిన దాని కన్నా 10 రేట్లు అద్భుతం

427

సూపర్ స్టార్ రజనీకాంత్, దిగ్గజ దర్శకుడు శంకర్, విలక్షణ నటుడు అక్షయ్ కుమార్ క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కిన 2.0 చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. బాహుబలి చిత్రంతో భారతీయ సినిమావైపు ప్రపంచం మొత్తం చూసింది. 2. 0 చిత్రంతో హాలీవుడ్ చిత్రాలని తలదన్నే ప్రయత్నం చేశాడు. అన్ని వర్గాల ప్రేక్షకులు విజువల్ వండర్ కోసం ఎదురుచూస్తున్నారు. రోబోలో రజనీకాంత్ చిట్టి పాత్రలో నటించారు. దానికి అప్డేటెడ్ వర్షన్ అంటూ ఈ చిత్రంలో చిట్టి పాత్రని కొనసాగించారు. అందాల బ్రిటిష్ సుందరి అమీజాక్సన్ హీరోయిన్ గా, రోబోగా నటించింది. ఇక ఈ చిత్రంలో అత్యంత ఆసక్తి రేపుతున్నది విలన్ పాత్ర. అక్షయ్ కుమారు వివిధ వికృత రూపాలలో కనిపిస్తూ ఆశ్చర్యపరిస్తున్నాడు. మరి ఈ సినిమా ఎలా ఉందొ రివ్యూ చూద్దామా.