Breaking News : అయ్యో దేవుడా ! నేనేం పాపం చేసాను నాకు కాన్సర్ అంటూ ఏడ్చేసిన బాలీవుడ్ హీరో

345

బాలీవుడ్ అలనాటి హీరో, స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ తండ్రి రిషికపూర్ క్యాన్సర్ బారిన పడ్డారు. గత కొద్దికాలంగా తన ఆరోగ్యంపై వస్తున్న ఊహాగానాలపై ఆయన మీడియా ముఖంగా స్పందించారు. క్యాన్సర్‌ను ఎదురించి త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యాన్ని సాధిస్తాను అని రిషికపూర్ ధీమా వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే.. గత కొద్దిరోజుల క్రితం క్యాన్సర్ వ్యాధికి సంబంధించి లక్షణాలు పరీక్షల్లో బయటపడ్డాయి.

 మనసు ప్రశాంతంగా ఉంది

ప్రస్తుతం రోగ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి అని రిషికపూర్ సోదరుడు రణ్‌ధీర్ కపూర్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో రిషి కపూర్‌ అమెరికాలో చికిత్స పొందుతున్నారనే వార్తలు మీడియాలో గుప్పుమంటున్నాయి. దాంతో నేను క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాను అని రిషికపూర్ స్వయంగా స్పందించారు. నేను క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాను. ప్రస్తుతం అమెరికాలో చికిత్స జరుగుతున్నది. దేవుడి దయతో త్వరలోనే క్యాన్సర్ మహమ్మారి నుంచి విముక్తుడిని అవుతాను. క్యాన్సర్ వ్యాధి చికిత్స చాలా క్రిటికల్‌గా ఉంది. ఈ చికిత్స సమయంలో సహనం ఉండాలి. సహనాన్ని అలవర్చుకొనేందుకు ప్రయత్నిస్తున్నాను అని రిషీ కపూర్ బాలీవుడ్ పత్రికతో అన్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో నాకు సినిమాలు లేకపోవడం చాలా ఆనందంగా ఉంది. ఇక సినిమాల గురించి ఆలోచించే అవకాశమే లేదు. దాంతో మనసు చాలా ప్రశాంతంగా ఉంది. శాంతియుత వాతావరణం క్యాన్సర్ వ్యాధిపై పోరాడేందుకు నాకు మరింత మనోధైర్యాన్ని ప్రసాదించింది. రిషికపూర్ ఆరోగ్యంపై రూమర్లు వస్తుండటంతో ఆయన సతీమణి నీతూకపూర్ కూడా గతంలో స్పందించారు. రిషీ ఆరోగ్యంపై నర్మగర్భంగా వ్యాఖ్యలు చేశారు. పర్యావరణం కలుషితం కాకుండా చూసుకొంటే క్యాన్సర్ (కర్కాటక రాశి) అనేది ఓ జాతక చిహ్నం మాత్రమే అని నీతూ అన్నారు.