షకీలా బయోపిక్ ఫస్ట్‌లుక్ అదరహో.. ఒంటిపై నూలు పోగు లేకుండా

627

90వ దశకంలో దక్షిణాది ప్రేక్షకులను ఉర్రూతలూగించిన శృంగార తార షకీలా జీవిత కథపై సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే.సుమారు రెండు దశాబ్దాలపాటు వెండితెరపై సంచలనం రేపిన నటి షకీలా ప్రస్తుతం సినీ పరిశ్రమకు దూరంగా ఉంటున్నారు.ఈ బయోపిక్ ను దర్శకుడు ఇంద్రజిత్ లంకేష్ రూపొందిస్తున్నారు.రిచా చద్దా షకీలాగా కనిపించనున్నారు.

స్టార్ హీరోలకు గుండె దడ

షకీలా బయోపిక్‌తోపాటు ఆమె జీవితంలో కూడా ప్రియుడి పాత్ర కీలకమైందనే చెప్పాలి.. షకిలా ప్రియుడి పాత్రలో మలయాళ నటుడు రాజీవ్ పిళ్లై నటిస్తున్నాడు. ఆ మధ్య విడుదలైన షకీలా బయోపిక్‌కు సంబంధించిన ఫస్ట్ లుక్‌‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ పాత్ర కోసం తన శరీరాకృతిని మార్చుకొని రిచా అందరికీ షాక్ ఇచ్చింది.

నూలుపోగు లేకుండా రిచా చద్దా లుక్

అయితే ఇప్పుడు రిచా బయోపిక్ లో తనకు సంబంధించిన లుక్ ను విడుదల చేసింది.నేను శృంగార తారను కాదు అంటూ (నాట్ ఏ పోర్న్ స్టార్‌) పోస్టర్‌పై రిచా చద్దా లుక్ కేక పెట్టించింది. ఒంటిపై నూలు పోగు లేకుండా బంగారం పూత పూసినట్టు నగలతో ధగధగ మెరిసిపోయింది. షకీలా లుక్‌లో రిచా చద్దా ఇచ్చిన పోజ్ సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.ఈ చిత్రం 2019 వేసవిలో విడుదల కానున్నది. ఈ చిత్రంలో స్వయంగా షకీలా అతిథి పాత్రలో కనిపించడం విశేషం.