లక్ష్మీస్ ఎన్టీఆర్ లో లక్ష్మి పార్వతి చంద్రబాబులు వీళ్ళే..

262

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ”లక్ష్మీస్ ఎన్టీఆర్” పేరిట ఎన్టీఆర్ బయోపిక్‌ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఎన్టీఆర్ బయోపిక్‌ను దర్శకుడు క్రిష్ రెండు భాగాలుగా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. వర్మ కూడా ఎన్టీఆర్ బయోపిక్‌ను తెరకెక్కించే పనిలో వున్నారు. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి ఎంటరైన దగ్గర నుంచి నడిచిన కథను లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో రామ్ గోపాల్ వర్మ ఓ సినిమా చేస్తున్నారు.

లక్ష్మీ పార్వతి పాత్రలో నటించేది ఈవిడే..

అయితే ఈ చిత్రం గురించి ఇప్పటివరకు ఒక్క వార్త గాని ఒక్క ఫోటో గాని రిలీజ్ కాలేదు. ఇందులో లక్ష్మీ పార్వతి పాత్ర పోషిస్తున్నది ఎవరు? అనే విషయం మాత్రం ఇప్పటి వరకు సస్పెన్స్‌గానే ఉంచుతూ వచ్చారు. తాజాగా ఆ సస్పెన్స్‌ వీడింది.పాపులర్ కన్నడ నటి యగ్న శెట్టి ఈ చిత్రంలో లక్ష్మీ పార్వతి పాత్రలో కనిపించబోతున్నారు.యగ్న శెట్టి గతంలో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘వీరప్పన్’ మూవీలో గంధపుచెక్కల స్మగ్లర్ భార్య పాత్రలో నటించారు. ఆవిడనే ఇపుడు తన తాజా చిత్రంలో ఎన్టీఆర్ భార్య లక్ష్మిపార్వతిగా చూపించబోతున్నారు.

చంద్రబాబు పాత్రలో...

అంతే కాదు… ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీలో చంద్రబాబు పాత్రలో కనిపించేది ఎవరు? అనే విషయం కూడా వర్మ వెల్లడించారు. అతడికి సంబంధించిన ఫోటో షేర్ చేశారు.