లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ “వెన్నుపోటు” సాంగ్ రీలీజ్ చేసి చంద్రబాబును టార్గెట్ చేసిన వర్మ

230

రెండు తెలుగు రాష్టాల్లో ఇప్పుడు ఒకే టాపిక్ గురించి డిస్కస్ చేసుకుంటున్నారు. అదే ఎన్టీఆర్. ఈయన జీవిత చరిత్ర మీద ఇప్పుడు రెండు సినిమాలు వస్తున్నాయి. అందులో ఒకటి బాలయ్య తీస్తుంటే మరొకటి ఆర్జీవీ తీస్తున్నాడు.ఎన్టీఆర్ కథానాయకుడు ఎన్టీఆర్ మహానాయకుడు అని బాలయ్య తీస్తుంటే.. బాలయ్య చూపించని లక్ష్మి పార్వతి జీవితం గురించి వర్మ తీస్తున్నాడు. లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ అనే పేరుతో ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

వెన్నుపోటు భీభత్సం

ఈ క్రమంలో సినిమాలోని ‘వెన్నుపోటు’ పాటను శుక్రవారం తన ట్విటర్‌ ద్వారా రిలీజ్‌ చేశారు రామ్‌ గోపాల్‌ వర్మ. పేరుకు తగ్గట్టే పాట ఫస్ట్‌లుక్‌లో ఎ‍న్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబును, ఇతర నాయకులను, వెన్నుపోటుకు వేదికగా నిలిచిన వైశ్రాయ్‌ హోటల్‌ను చూపించారు.

గీత రచయిత సిరాశ్రీ రాసిన ఈ పాటకు కల్యాణ్‌ మాలిక్‌ సంగీతం అందించడంతో పాటు స్వయంగా ఆలపించారు. కాగా ఎన్టీఆర్‌ బయోపిక్‌ ఆధారంగా.. బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన ‘కథానాయకుడు’ ఆడియో రిలీజ్‌ నాడే వర్మ వెన్నుపోటు పాటను రిలీజ్‌ చేయడం ద్వారా ఎన్టీఆర్‌ అభిమానుల్లో ఆసక్తి పెంచారు.