“లక్ష్మీస్ ఎన్టీఆర్ “మరొక రెండు పోస్టర్స్ ను విడుదల చేసిన ఆర్జీవీ

194

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ”లక్ష్మీస్ ఎన్టీఆర్” పేరిట ఎన్టీఆర్ బయోపిక్‌ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఎన్టీఆర్ బయోపిక్‌ను దర్శకుడు క్రిష్ రెండు భాగాలుగా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. వర్మ కూడా ఎన్టీఆర్ బయోపిక్‌ను తెరకెక్కించే పనిలో వున్నారు. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి ఎంటరైన దగ్గర నుంచి నడిచిన కథను లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో రామ్ గోపాల్ వర్మ ఓ సినిమా చేస్తున్నారు. పాపులర్ కన్నడ నటి యగ్న శెట్టి ఈ చిత్రంలో లక్ష్మీ పార్వతి పాత్రలో కనిపించబోతున్నారు.పాత్రలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ రంగస్థల కళాకారుడు న‌టిస్తున్నారు.

ఇప్పటికే విడుదల చేసిన పాటలు కొన్ని పోస్టర్స్ సినిమా మీద అంచనాలను క్రియేట్ చేస్తున్నాయి.ఇప్పుడు చిత్రానికి సంబంధించి రెండు ఫోటోలను ట్విట్టర్ ద్వారా ప్రేక్షకులతో పంచుకున్నారు. ఇందులో ఓ ఫోటోలో అన్నగారు కుర్చీలో కూర్చొని ఆలోచనలో ఉన్న స‌మ‌యంలో ఆయన వద్దకు ల‌క్ష్మీ పార్వతి న‌డిచొస్తున్నట్టుగా ఉంది.

రెండో ఫోటోలో తెలుగు దేశం పార్టీ నాయకులతో కలిసి ఎన్టీఆర్ భోజనం చేస్తుండగా లక్ష్మీ పార్వతి భోజనం వడ్డిస్తున్నట్టుగా ఉంది. ఈ రెండు ఫొటోలు నిజజీవితానికి చాలా దగ్గరగా ఉండటంతో వర్మ అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. నిజాన్ని నిజంగా చూపించాలంటే వర్మ తరవాతే అంటూ కామెంట్లు పెడుతున్నారు. ణకడం