వినయ విధేయ రామ ట్రైలర్ డైమండ్ గోల్డ్ అంటూ వర్మ కామెంట్స్..

243

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా ‘వినయ విధేయ రామ’. .డి.వి.వి.ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై దానయ్య డి.వి.వి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.కైరా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ విలన్ పాత్రలో కనిపించనున్నారు.

వినయ విదేయ రామ

తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో విడుదల చేశారు.ఈ వేడుకలో కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకాగా.. మెగాస్టార్ చిరంజీవి, త్రివిక్రమ్ శ్రీనివాస్, బోయపాటి తదితరులు హాజరయ్యారు. కేటీఆర్, మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ‘వినయ విధేయ రామ’ ట్రైలర్‌ను విడుదల చేశారు. వినయ విధేయ రామ టైటిల్ చాలా సాఫ్ట్‌గా ఉన్నా.. సినిమా ఫుల్ మాస్ అని టీజర్‌లోనే హింట్ ఇచ్చారు దర్శకుడు బోయపాటి శ్రీను.

తాజాగా వివాదాస్పద దర్శకుడు బోయపాటి వినయ విధేయ రామ ట్రైలర్ పై స్పందించాడు.వినయ విధేయ రామ ట్రైలర్ గోల్డ్ లాంటి కెజిఎఫ్ చిత్రాన్ని, డైమండ్స్ తో మిక్స్ చేసి ఉంది. కాబట్టి హిందీలో కూడా విడుదల చేయాలి అని తెలిపాడు. జంజీర్ చిత్రాన్ని పక్కన పెడితే రాంచరణ్ కు ఈ చిత్రం హిందీలో మెమొరబుల్ మూవీ అవుతుందని వర్మ పేర్కొన్నాడు. రాంచరణ్ లుక్ మైండ్ బ్లోయింగ్ అంటూ కాంప్లిమెంట్ ఇచ్చాడు.