అదే రిపీట్ చేయ‌నున్న రాజ‌శేఖ‌ర్

419

గ‌రుడ వేగ సినిమాతో మంచి విజ‌యం చాలా కాలం త‌ర్వాత అందుకున్నారు హీరో రాజ‌శేఖ‌ర్ …ఇక ఈ సినిమా ఆయ‌న కుటుంబంలో ఎంతో ఆనందం నింపింది.. మంచి లైన‌ప్ తో స్టోరీ రాయడంతో, ద‌ర్శ‌కుడు ప్ర‌వీణ్ స‌త్తార్ కు, అలాగే రాజ‌శేఖ‌ర్ కు మంచి ఫేమ్ తీసుకువ‌చ్చాయి. ఈ సినిమాతో ప్ర‌వీణ్ స‌త్తార్ పేరు మ‌రింత టాలీవుడ్ లో వినిపించింది..

Image result for rajashekar

ఇక ఆయ‌న ఈ సినిమాలో పోషించిన పాత్ర ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్,ఆయ‌న‌కు ఈ రోల్ మ‌రింత ఆక‌ర్ష‌ణ తీసుకువ‌చ్చేలా చేసింది.. ఈ మూవీలో ఆయ‌న న‌ట‌న యాక్ష‌న్ స‌న్నివేశాలు కొత్త‌ద‌నంగా క‌నిపించాయి టాలీవుడ్ ప్రేక్ష‌కుల‌కు. అయితే ఇదే ఫార్మూలా మ‌ళ్లీ త‌న కొత్త చిత్రంలో ఫాలో అవ్వ‌నున్నార‌ట రాజ‌శేఖ‌ర్.

Image result for rajashekar

మీరు విన్న‌ది నిజ‌మే ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ చిత్రంలో ఆయ‌న న‌టించ‌నున్నార‌ట‌. అవె ఫెమ్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించనున్న ఈచిత్రంలో ఆయన పోలీస్ పాత్రలో నటించనున్నారు . ప్రస్తుతం ప్రశాంత్ తమన్నా కథనాయికగా హిందీ క్వీన్ చిత్రం ను తెలుగులో దటీస్ మహాలక్ష్మి పేరుతో రీమేక్ చేస్తున్నారు…ప్ర‌స్తుతం ఈ సినిమా సెట్స్ పై ఉంది ఈ సినిమా అయిపోయిన త‌ర్వాత‌… రాజ‌శేఖ‌ర్ తో ప్ర‌శాంత్ వ‌ర్మ ఈ కొత్త సినిమాని స్టార్ట్ చేయ‌నున్నారు అని తెలుస్తోంది.