మళ్ళి మొహానికి రంగేసుకుంటున్న రేణు దేశాయ్..

390

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ గురించి రోజుకొక వార్త బయటకు వస్తుంది.పవన్ కళ్యాణ్ నుంచి విడిపోయిన తర్వాత ఆమె పిల్లలతో కలిసి పుణేలో ఉంటుంది.అయితే అభిమానులకు సోషల్ మీడియా ద్వారా టచ్ లో ఉంది.అయితే ఈ మద్యనే రెండో పెళ్ళికి సిద్దమైంది రేణు.త్వరలో ఆ పెళ్లి కూడా జరగబోతుంది.అయితే ఇప్పుడు మరొక వార్త రేణుదేశాయ్ గురించి బయటకు వచ్చింది.

దేణుదేశాయ్ రియల్ లైఫ్‌లో మాత్రమే కాకుండా రీల్ లైఫ్‌లోనూ సెకండ్ ఇన్సింగ్స్ మొదలుపెట్టబోతుందంటూ సరికొత్త న్యూస్ సర్క్యులేట్ అవుతోంది. బద్రి, జానీ చిత్రాల్లో పవన్ సరసన హీరోయిన్‌గా అలరించిన రేణూ త్వరలో మరోసారి ముఖానికి రంగేసుకోవడానికి రెడీ అయ్యిందట.

ఇటీవల రెండో పెళ్లికి నిశ్చితార్థం చేసుకున్న రేణూ వివాహం అనంతరం ఓ తెలుగు సినిమాలో నటించేందుకు సంతకం చేసిందని పుకార్లు నడుస్తున్నాయి.ఒక యువ హీరోకి వదినగా నటిస్తుందంటూ మరోవార్త చక్కర్లు కొడుతోంది.చూడాలి మరి ఎలాంటి క్యారెక్టర్ చేస్తుందో.