ఖుషి సినిమా అప్పటి మంచి జ్ఞాపకాన్ని గుర్తుకు చేసుకున్న రేణుదేశాయ్..

349

పవన్ కళ్యాణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ సినిమా అంటే ఖుషి అనే చెప్పుకోవాలి.ఈ సినిమా అప్పట్లో ట్రెండ్ క్రియేట్ చేసింది.ఈ సినిమా చుసిన యూత్ ఫిదా అయిపోయారు.పవన్ కళ్యాణ్ భూమిక జోడికి అందరు అభిమానులు అయ్యారు.ముఖ్యంగా ఈ సినిమాలోని పాటలు ఇప్పటికి కూడా చాలా మందికి ఫెవరెట్ సాంగ్స్ అంటే అతిశయోక్తి కాదు.ముఖ్యంగా ఈ సినిమాలో ‘‘ఆడువారి మాటలకు అర్థాలే వేరులే’’ అనే పాట యువ హృదయాల మనసు దోచుకుంది.

ఈ పాటలో హీరో పవన్ కళ్యాణ్, హీరోయిన్ భూమిక లతో పాటుగా ఓ కుక్క కనిపిస్తుంది. దీని పేరు బెల్.. ఇది పవన్- రేణు దేశాయ్‌ల పెంపుడు కుక్క. కాగా ఈ కుక్క జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ పోస్ట్ చేసింది రేణు దేశాయ్.‘ఆడువారి మాటలకు అర్థాలే వేరులే’ పాటలోని ఓ స్టిల్‌ని పంచుకుంటూ.. ‘‘ఇది ఖుషి సినిమాలోని ఆడువారి మాటలకు అర్థాలే వేరులే పాట షూట్ చేస్తున్నప్పటి స్టిల్. ఇందులో బెల్ కూడా ఉంది. ఈ పాటను న్యూజిలాండ్‌లో చిత్రీకరించారు. షూటింగ్ జరుగుతున్నపుడు అందరూ బెల్ ఆకారం చూసి భయపడేవారు.

అప్పుడు నేను ఖుషి సినిమాకు సహాయ దర్శకురాలిగా, సహాయ ప్రొడక్షన్ పర్సన్‌గా ఉన్నాను. బెల్‌ని చూసి అందరూ భయపడుతుంటే షూటింగ్ పూర్తయ్యేంత వరకు రెండు రోజులపాటు దాన్ని దగ్గరుండి నేనే చూసుకున్నా. ఆ రోజులు చాలా సరదాగా గడిచాయి. అవి అందమైన, ఆనందకరమైన షూటింగ్ జ్ఞాపకాలు’’ అని ట్యాగ్ చేసింది రేణు దేశాయ్.