రేణు దేసాయ్ మరో సంచలన నిర్ణయం.. ఇది ఎవ్వరూ ఊహించరు.

512

పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి రేణు దేశాయ్ త్వరలో రెండవ వివాహానికి సిద్ధం అవుతోంది. ఇటీవలే రేణు దేశాయ్ నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్న రేణు దేశాయ్ సంచలన నిర్ణయం తీసుకుంటోంది.సంచలన నిర్ణయం అంటే ఏమిటో అని కంగారు పడకండి.తను త్వరలో ఒక సినిమాను తెరకెక్కించబోతుంది.అందులో సంచలనం ఏముంది అంటారా..ఉంది ఆమె తెరకెక్కించే చిత్ర కథ అలాంటి ఇలాంటిది కాదు.ఇప్పటివరకు ఎవరు తీయని కథతో ఈమె ఈ చిత్రం తీయబోతుంది.మరి ఆ విషయాల గురించి పూర్తీగా తెలుసుకుందామా.

Image result for renu desai

సంపాదన కొరకు రేణు దేశాయ్ గతంలో సొంతంగా సినిమాలు నిర్మించి తెరకెక్కించిన సంగతి మన అందరికి తెలిసినదే.తాజగా ఆమె తెలుగులోనే ఓ చిత్రాన్ని తెరకెక్కించడానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి రేణు దేశాయ్ దర్శకత్వం వహిస్తారు. ఆమె ఎలాంటి కథ ఎంచుకున్నారో తెలిస్తే ఆశ్చర్యం వేయక మానదు.సందేశాత్మక చిత్రాలు తెరకెకెక్కించడం ఏ దర్శకుడికైనా సవాల్ తో కూడుకున్న పని. సందేశాత్మక చిత్రాలలలో సందేశం ఉంటె సరిపోదు. ఆడియన్స్ ని మెప్పించే అంశాలు కూడా ఉండాలి. అలాంటి అంశాలను ఒక చోట చేర్చి ఒక కథ సిద్దం చేసింది.ఆ కథ దేని గురించో తెలుసా..రైతుల ఆత్మహత్యల కథ.రేణు దేశాయ్ రైతుల ఆత్మహత్యల నేపథ్యంలో చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. నిజంగా ఇది గొప్ప నిర్ణయమే.రైతు సమస్యలపై చాలా సినిమాలు వచ్చాయి. కానీ రైతు ఆత్మహత్యలే ప్రధాన ఇతివృత్తంగా సినిమా రాలేదు.Image result for renu desai

ఈ నేపథ్యంలో తాను కథ సిద్ధం చేసుకుంటున్నట్లు రేణు దేశాయ్ వివరించారు. దేశంలోనే రైతులు మరణాలు ఎంత హాట్ టాపిక్కో అందరికి తెలిసిందే.ఈ చిత్రం గురించి రేణుదేశాయ్ మాట్లాడుతూ….తాను డాన్స్ షో కోసం హైదరాబాద్ వచ్చినప్పుడు తెలుగు సినిమాకు దర్శకత్వం ఎప్పుడు వహిస్తారని చాలా మంది అడిగారు. ఎట్టకేలకు తెలుగు చిత్రం తెరకెక్కించాలని నిర్ణయించుకున్నా. కథ సిద్ధం చేశా. ప్రస్తుతం డైలాగ్స్ రాస్తున్నట్లు రేణు దేశాయ్ వివరించింది.తాను చిన్న తనంలో తాన్ తండ్రి వ్యవసాయం చేయడం దగ్గరినుంచి చూశానని రేణు దేశాయ్ తెలిపింది. ఈ సినిమా కోసం ఓ గ్రామానికి వెళ్లి రైతులని ప్రత్యక్షంగా పరిశీలిస్తానని తెలిపింది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఆసక్తికరంగా ఈ చిత్రానికి నిర్మాత కూడా రేణు దేశాయ్ కావడం విశేషం. బయటవారి నిర్మాత అయితే నేను సమాధానం చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి ఈ చిత్రాన్ని నేనే నిర్మిస్తున్నా. రైతుల సమస్యలని చూపించడం మాత్రమే కాక పరిష్కారం కూడా ఈ చిత్రంలో చూపిస్తానని రేణు దేశాయ్ తెలిపింది.చూడాలి మరి ఈ చిత్రం ఎలా ఉండబోతుందో.మరి ఈ విషయం మీద మీరేమంటారు.రైతుల ఆత్మహత్యల మీద రేను దేశాయ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.