బాబా భాస్కర్ ఉధయభాను మధ్య అసలు సంబంధం ఏమిటి

1250

తెలుగు బుల్లి తెర ప్రేక్షకులను దాదాపు రెండు దశాబ్దాలుగా అలరిస్తున్న యాంకర్‌ ఉదయభాను. ఈమె గురించి ఎన్నో పుకార్లు, మరెన్నో వార్తలు వచ్చాయి. అలాగే చాలా ఏళ్ల క్రితం బాబా భాస్కర్‌తో ఈమె ఢీ 2 చేసింది. ఆ షోకు వీరిద్దరు యాంకర్‌గా వ్యవహరించారు.. ఆ సమయంలో వీరిద్దరి ప్రవర్తన కాస్త అతిగా ఉండేది. రవి, లాస్యల కంటే కాస్త శృతి మించి మరీ వీరిద్దరు బుల్లి తెరపై ప్రదర్శణ చేసేవారు. దాంతో ఇద్దరి మద్య ఏదో ఉంది అనే పుకార్లు తారా స్థాయిలో వచ్చేవి.అప్పట్లో వచ్చిన వార్తలపై బాబా భాస్కర్‌ తాజాగా అలీతో సరదాగా ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు. ఉదయ భానుతో తనకు స్నేహం తప్ప మరేం లేదని, ఆమె నేను ఒక షోకు హోస్ట్‌లుగా వ్యవహరించాం కనుక క్లోజ్‌గా ఉండేవాళ్లం. అంతకు మించి ఏం లేదని ఆయన చెప్పుకొచ్చాడు. మా ఇద్దరి మద్య అప్పట్లోనే వ్యవహారం నడిచింది అంటూ వార్తలు వచ్చాయి. అదే ఇప్పుడైతే మరెంతగా వార్తలు వచ్చేవో అంటూ బాబా మాస్టర్‌ అన్నాడు. .

Image result for బాబా భాస్కర్ ఉదయభాను

తికమక ప్రశ్నలు అడిగే అలీ బాబా భాస్కర్ ని ఈ ప్రశ్న అడిగారు… అప్పట్లో ఓ యాంకర్ కోసం మీరు స్టూడియోలు చుట్టూ తిరిగేవారట.. ఎవరా యాంకర్? అని అడిగాడు. అయితే ఆ ప్రచారంలో నిజం లేదన్నాడు భాస్కర్. ఉదయ్ భాను, తాను కలిసి ఢీ2 షోకి యాంకరింగ్ చేశామని.. దాంతో కొంతమంది లేనిపోనివి అనుకునేవాళ్లని చెప్పారు. కానీ తమ మధ్య అలాంటిదేమి లేదని స్పష్టం చేశారు.ఉదయ్ భాను,తాను గాడ్&డెవిల్‌లా ఉండేవారమని చెప్పారు. ఉదయ్ భాను డెవిల్ అయితే తాను గాడ్ అని చెప్పారు.

ఈ క్రింద వీడియో చూడండి

అయితే ఢీ-2 షోలో తనకు, ఉదయ్ భానుకు మధ్య జరిగే సరదా గొడవలను తన భార్య మరోలా అర్థం చేసుకునేదని భాస్కర్ అన్నారు. ‘ఎందుకు.. ఎప్పుడు ఆ అమ్మాయితో కలిసుంటావు,చేతులు పట్టుకుంటావు’ అని తన భార్య అడిగేదన్నారు. అది డ్యాన్స్ షో కాబట్టి.. ఇద్దరం డ్యాన్స్ చేసేటప్పుడు సాధారణంగా చేతులు పట్టుకునేవాళ్లమని చెప్పారు. దాన్ని కూడా తప్పుగా అర్థం చేసుకుంటే ఎలా అన్నారు. అయితే తాను కాస్త ఓవరాక్షన్ చేస్తున్నానని తన భార్య హెచ్చరించిందని.. అంతే తప్ప ఇంకేమీ లేదని ముగించేశారు. మొత్తానికి బిగ్ బాస్ హౌస్ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా బాబా భాస్కర్ ని అందరూ చెబుతున్నారు, ఎవరితోనూ వివాదాలు పెట్టుకోకుండా అందరితో సరదాగా ఉంటూ చలాకీగా ఉంటున్నారు ఆయన.. ఇక తెలుగు ప్రజలు అందరూ కూడా బిగ్ బాస్ హౌస్ లో ఉన్న బాబా భాస్కర్ ని ఆయన పద్దతిని చూసి ఆయన హౌస్ లో కొనసాగాలి అని అంటున్నారు. సో చూడాలి బాబా భాస్కర్ ఇంకెంత బాగా అలరిస్తారో వచ్చే రోజుల్లో.