వెంక‌టేష్ – వ‌రుణ్ భార్యా బాధితులా ?

367

టాలీవుడ్ లో హీరో వెంక‌టేష్ సినిమాలు కుటుంబ చిత్రాలు బాగా చేస్తాడు అనే పేరు ఉంది… ముఖ్యంగా కుటుంబ క‌థా చిత్రాలు చేయ‌డంలో వెంక‌టేష్ కు మంచి పేరు ఉంది..ఇక టాలీవుడ్ లో మ‌ల్టీస్టార‌ర్ సినిమాలు చేయ‌డంలో వెంక‌టేష్ ముందు ఉంటారు.. అలాగే మహేష్ తో సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు మంచి స‌క్సెస్ ను అందుకుంది.

Image result for venky and varun

తాజాగా యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, విక్టరీ వెంకటేష్ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న చిత్రం ఎఫ్ 2 దీనికి ట్యాగ్ లైన్ కూడా డిఫ‌రెంట్ గా ఉంది… ఫ‌న్ అండ్ ఫ్ర‌స్ర్టేషన్.. ఇక ఈ సినిమాపై అనేక వార్త‌లు ఇప్ప‌టికే వైర‌ల్ అవుతున్నాయి. ఈ సినిమాలో వీరిద్ద‌రూ భార్యాభాదితులు అని ఇదే క‌థ అని ఓ వార్త వినిపిస్తోంది.. భార్య‌ల‌తో విసిగివేసారిపోయిన పాత్ర‌ల్లో వీరు క‌నిపిస్తార‌ట‌.. చివ‌ర‌కు వీరు ఇద్ద‌రూ బ్యాంకాక్ వెళ‌తార‌ట.

Image result for venky and varun

అక్క‌డ వారికి ఎటువంటి ప‌రిస్దితులు ఎదురు అయ్యాయి అనేది ఈ చిత్రం పాయింట్..అనిల్ ఈ చిత్రాన్ని పూర్తి హాస్యభరితంగానే చిత్రీకరించనున్నారట. ఈ చిత్రంలో వెంకటేశ్ జోడిగా తమన్నా.. వరుణ్ తేజ్ జోడిగా మెహరీన్ నటిస్తున్నారు. మ‌రి దీనిపై ఏ విష‌యం అనేది చిత్ర యూనిట్ ఏదైనా ఓ విష‌యం తెలియ‌చేస్తేనే తెలుస్తుంది… అప్ప‌టి వ‌ర‌కూ ఈ రూమ‌ర్లు వ‌స్తూనే ఉంటాయి.