‘అమర్ అక్బర్ ఆంటోనీ’ ప్రీ రిలీజ్ వేడుక తేదీని ఖరారు చేసిన చిత్ర యూనిట్

260

మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ శ్రీనువైట్ల కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ చిత్రం ‘అమర్ అక్బర్ ఆంటోనీ’.ఇలియానా హీరోయిన్. లయ, సునీల్, వెన్నెల కిషోర్, రఘు బాబు, తరుణ్ అరోరా, అభిమన్యు సింగ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఎస్ఎస్ థ‌మ‌న్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేక‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

Image result for raviteja aaa movie

రవితేజ శ్రీనువైట్ల కాంబినేషన్‌లో వస్తున్న నాలుగో చిత్రం మరియు రవితేజ ఇలియానా కాంబినేషన్ లో కూడా నాల్గవ చిత్ర కావడంతో సినిమాపై మంచి అంచనాలున్నాయి.ఇటీవలే ఈ సినిమా టీజర్‌ని విడుదల చేశారు.‘అమర్ అక్బర్ ఆంటోనీ’లుగా మూడు విభిన్న పాత్రల్లో కనిపిస్తున్నారు రవితేజ. ఓవరాల్ టీజర్‌లో సీరియస్ లుక్‌లో డిఫరెండ్‌గా ఉన్నాడు మాస్ రాజా.

amar akbar anthony pre-release event on november 10th

ఇప్పటికే విడుదలైన టీజర్, మొదటి పాటకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. వీటి కారణంగా సినిమాపై అంచనాలు కూడా పెరిగాయి. నవంబర్ 16న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్ర నిర్మాతలు ప్రీ రిలీజ్ వేడుకకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను నవంబర్ 10న నిర్వహించబోతున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.