బ్లాక్ బస్టర్ సినిమా రీమేక్ లో రవితేజ…

441

తెలుగు ఇండస్ట్రీ లో కష్టపడి వచ్చిన నటులలో రవితేజ ఒకడు.కష్టే ఫలి అని నమ్ముకుని స్టార్ గా ఎదిగాడు.ఎన్నో ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చాడు.ఇప్పుడు మరొక హిట్ ఇవ్వడానికి సిద్దమవుతున్నాడు.రవితేజ కెరీర్ లో రీమేక్ సినిమాలు చాలా తక్కువ ఉన్నాయి.రీమేక్స్ చెయ్యడం రవితేజకు ఇష్టం ఉండదు.కథ ఎంతో నచ్చితేనే రీమేక్ చేస్తాడు.ఇప్పుడు అదే చెయ్యబోతున్నాడు.

Image result for ravi teja

తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన తేరి చిత్రం ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలనే ఆలోచనలో దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ ఉన్న సంగతి తెలిసిందే. రవితేజ హీరోగా ఈ చిత్రం రూపొందనుంది. ఈ చిత్రం గురించి తాజాగా ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది.సంతోష్ శ్రీనివాస్ తేరి కథని తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్పులు చేసి రెడీగా ఉన్నాడట. మైత్రి మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది.

Image result for ravi teja

సెప్టెంబర్ నుంచి ఈ చిత్రం సెట్స్ పైకి వెల్ళబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. రవితేజ ప్రస్తుతం శ్రీనువైట్ల దర్శకత్వంలోని అమర్ అక్బర్ ఆంటోని చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్ర షూటింగ్ ఓ కొలిక్కి వచ్చాక తేరి రీమేక్ మొదలు పెట్టాలని రవితేజ భావిస్తున్నాడు.