గీతగోవిందం’ షూటింగ్‌లో డైరెక్ట‌ర్‌ నన్ను ఏడిపించారు రష్మిక సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

345

తాను అల్లరిపిల్లలా కనిపించినప్పటికీ, చాలా సున్నితమైన వ్యక్తినని హీరోయిన్ రష్మిక మందన తెలిపింది. ఎవరైనా ముభావంగా ఉంటే ‘నా కారణంగానే వాళ్లు బాధపడుతున్నారా?’ అని టెన్ష‌న్ ప‌డిపోతాన‌ని తెలిపింది. దేవదాస్ సినిమా హిట్ టాక్ వ‌చ్చిన త‌ర్వాత ఆమెకు మ‌రిన్ని అవ‌కాశాలు వెనుక వ‌చ్చాయి తాజాగా రష్మిక పలు అంశాలపై మీడియాతో ముచ్చటించింది. గీతగోవిందం షూటింగ్ సందర్భంగా డైరెక్టర్ పరశురామ్ తనను ఆటపట్టించిన విషయాన్ని ఈ సందర్భంగా రష్మిక పంచుకుంది. ఓసారి గీతగోవిందం షూటింగ్ స్పాట్ కు వెళ్లడం కొంచెం ఆలస్యం అయిందని రష్మిక తెలిపింది. ‘‘నాతో ఎవరైనా నవ్వుతూ మాట్లాడకపోతే చాలా ఇబ్బంది పడిపోతా. ఆరోజు షూటింగ్ స్పాట్ కు కొంచెం ఆలస్యంగా వెళ్లడంతో సెట్ లో ఎవ్వరూ నాతో మాట్లాడలేదు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

నేను పలకరించినా ఎవ్వరూ పట్టించుకోలేదు. దీంతో నేను ఓ చోట కూర్చుని ఏడ్చేశా. వెంటనే దర్శకుడు పరశురామ్ అక్కడకు పరిగెత్తుకుంటూ వచ్చారు. ‘నిన్ను ఆటపట్టించడానికే ఇదంతా చేశాం’ అంటూ ఓదార్చారు. అప్పటి వరకూ నన్ను ఫాలో అవుతున్న కెమెరాను పరశురామ్ చూపించారు. అసలు నన్ను ఓ కెమెరా ఫాలో అవుతుందని అప్పటి వరకూ నాకు తెలియలేదు,అని ఈ ఘటనను రష్మిక గుర్తుచేసుకుంది. ఇలా ఆమె ఎలాంటి రియాక్ష‌న్ చూపిస్తుందా అని అంద‌రూ అనుకున్నారు… చివ‌రకు ఆమెతో ఎవ‌రూ మాట్లాడ‌క‌పోవ‌డంతో వెంటనే క‌న్నీరు పెట్టుకుంది.ఇలాంటి స‌మ‌యంలో కొంద‌రిని ఆట‌ప‌ట్టించిన సంద‌ర్బాలు చాలా ఉంటాయి అని ఇలా త‌న అల్ల‌రిని అంద‌రూ ఎంజాయ్ చేశారు అని ర‌ష్మిక చెప్పుకొచ్చింది. మొత్తానికి ఆమెకి అలా ద‌ర్శ‌కుడు అస‌లు విష‌యం చెప్ప‌డంతో ఒక్క‌సారిగా ఆమెన‌వ్వుతూ మ‌ళ్లీ షూటింగ్ లోకి వ‌చ్చి ఎప్ప‌టిగా స‌ర‌దాగా ఉంద‌ట‌.