డియర్ కామ్రేడ్ లో లేడి క్రికెటర్‌తో విజయ్ దేవరకొండ రొమాన్స్..

308

టాలీవుడ్‌లో విజయ్ దేవరకొండ క్రేజ్ ఎంతగా పెరిగిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ‘అర్జున్ రెడ్డి’ సినిమా తర్వాత ‘గీత గోవిందం’, ‘ట్యాక్సీవాలా’ సినిమాలతో మాంచి విజయాలు తన ఖాతాలో వేసుకున్న విజయ్ ఇప్పుడు స్టార్ హీరో అయ్యాడు.ప్రస్తుతం విజయ దేవరకొండ పట్టిందల్లా బంగారం అవుతోంది. ఏమాత్రం అంచనాలు లేకుండా విడుదలైన టాక్సీవాలా చిత్రం మంచి విజయం సాధించింది.

Interesting news about Rashmika Mandanna role in Dear Comrade

ప్రస్తుతం విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ చిత్రంలో నటిస్తున్నాడు.భరత్ ఈ చిత్రానికి దర్శకుడు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్ నుంచి వస్తున్న మరో చిత్రం ఇది. ఈ చిత్రంలో గీత గోవిందం హీరోయిన్ రష్మిక మరోమారు విజయ్ సరసన నటిస్తోంది.డియర్ కామ్రేడ్ చిత్రంలో రష్మిక పాత్ర గురించి ఆసక్తికరమైన వార్తలు వస్తున్నాయి.

Image result for rashmika vijay devarakonda images

రష్మిక ఈ చిత్రంలో తెలంగాణకు చెందిన లేడి క్రికెటర్ గా నటిస్తోందట. రష్మిక మాట్లాడే భాష తెలంగాణ యాసలో ఉండనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక దిగ్గజ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ వద్ద రష్మిక శిక్షణ తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.విజయ్ దేవరకొండ ఈ చిత్రంలో స్టూడెంట్ పాత్రలో కనిపించనున్నాడు.వచ్చే ఏడాది డియర్ కామ్రేడ్ ని ప్రేక్షకుల ముందు తీసుకురానున్నారు.