రష్మిక గోల్డెన్ ఛాన్స్.. #RRR లో హీరోయిన్ గా బంపర్ ఆఫర్ కొట్టేసిన ముద్దుగుమ్మ?

300

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కబోతున్న మల్టీస్టారర్ మూవీ ఆదివారం ఉదయం 11.11 గంటలకు లాంచనంగా ప్రారంభం అయింది. ఈ ప్రారంభోత్సవ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, అల్లు అరవింద్, సురేష్ బాబు, వివి వినాయక్‌, కొరటాల శివ, ప్రభాస్, రానాతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

Image result for #rrr

బాహుబలి తర్వాత ఆ స్థాయికి తగిన విధంగా సినిమా ప్లాన్ చేసిన రాజమౌళి ఎన్టీఆర్, రామ్ చరణ్‌ కలయికతో రేర్ కాంబినేషన్ సెట్ చేశారు. మెగా, నందమూరి అభిమానుల సపోర్టుతో ఈ సినిమా ఏ స్థాయికి వెళుతుందో ఎవరూ ఊహించలేక పోతున్నారు.ఇంతవరకు అపజయం అంటూ ఎరుగని దర్శకుడు ఒక వైపు అలాగే కలక్షన్స్ తో రికార్డులను సృష్టించే ఇద్దరు స్టార్ హీరోలు మరో వైపు . వీరి ముగ్గురి కలయికలో సినిమా వస్తుదంటే అంచనాలు ఏ స్థాయిలో వుంటాయో చెప్పనక్కర్లేదు.త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కాబోతుంది.

Image result for rashmika mandanna

అయితే ఈ ఇద్దరు హీరోలకు జోడిలను వెతికే పనిలో ఉన్నాడు జక్కన.ముగ్గురు ముద్దుగుమ్మలను ఈ చిత్రంలో నటింపజేస్తాడనే ప్రచారం జోరుగా సాగుతుంది. చిత్ర యూనిట్‌ సభ్యులు కూడా ఆ విషయాన్ని నిర్థారించారు. అయితే ఇప్పటి వరకు ఆ ముగ్గురు ఎవరు అనే విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.రాజమౌళి పలువురు హీరోయిన్స్‌ను పరిశీలిస్తున్నట్లుగా సమాచారం అందుతుంది.తాజాగా ఈ మల్టీస్టారర్‌ చిత్రంలో రష్మిక ఒక హీరోయిన్‌గా నటించబోతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. చూడాలి మరి ఈ హీరోయిన్ కు ఒకే చేస్తాడా లేక బాలీవుడ్ హీరోయిన్స్ ను దించుతాడో.