మళ్లీ ప్రేమలో పడ్డ రష్మిక మందన్న?

425

అందాల భామ రష్మిక మందన్న టాలీవుడ్‌లో సక్సెస్‌ల జోరును కొనసాగిస్తున్నది.తెలుగులో ఛలో మూవీతో కెరీర్ ప్రారంభించింది. గీతా గోవిందం బ్లాక్‌బస్టర్ కావడంతో క్రేజీ హీరోయిన్‌గా మారింది. ఆ తర్వాత దేవదాస్ కూడా సక్సెస్ అందుకోవడంతో మరింత జోష్ పెరిగింది.తెలుగు సినీ పరిశ్రమకు ప్రస్తుతం అదృష్టరేఖగా మారింది.

Image result for geetha govindam

గీతా గోవిందం సినిమా తర్వాత మళ్లీ విజయ్ దేవరకొండతో జతకట్టింది. వారిద్దరూ నటిస్తున్న డియర్ కామ్రేడ్ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. నితిన్‌తో సినిమా సెట్స్‌పైకి వెళ్లాల్సి ఉంది.ఇలా విజయాలతో దూసుకుపోతున్న రష్మిక జీవితంలో తన ప్రియుడు రక్షిత్ శెట్టితో నిశ్చితార్థం బ్రేకప్ కావడం ఆమెను ఓ కుదుపు కుదిపేసింది.రక్షిత్ శెట్టితో బ్రేకప్ తర్వాత రష్మిక ఇప్పడిప్పుడే బ్రేకప్ విషాదం నుంచి కోలుకొంటున్నది.

Image result for rashmika mandanna

అయితే రష్మిక మళ్లీ ప్రేమలో పడ్డారనే విషయం చర్చనీయాంశమైంది.డేటింగ్ చేస్తున్నదంటూ ఓ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఓ హీరోతో చనువుగా ఉంటుందనే వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే వాటిపై పెద్దగా క్లారిటీ లేదు. ఆమె సన్నిహితులు ఈ వార్తలను ఖండించారు.