రష్మిక మందాన రియల్ స్టోరీ….

736

రష్మిక మందాన..ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్. చలో సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి, గీతా గోవిందం సినిమాతో స్టార్ హీరోయిన్ అయ్యింది. తన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్దుల్ని చేస్తుంది. ఆమె అందానికి నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. రశ్మికకు ప్రస్తుతం క్రేజీ ఆఫర్స్ దక్కుతున్నాయి. టాలీవుడ్ లో స్టార్ హీరోలందరి చూపు రష్మిక మీదనే ఉంది. పద్దతిగా ఎంట్రీ ఇచ్చి తర్వాత గ్లామర్ పాత్రలు చేసి అభిమానులను సంపాదించుకుంది. ఈ నేపథ్యంలో రష్మిక సినీ ఇండస్ట్రీలోకి ఎలా అడుగుపెట్టారు. ఆమె ప్రస్థానం ఏమిటి అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Related image

బాల్యం, చదువు…
రష్మిక కర్ణాటకలోని కొడగు జిల్లాలోని విరాజ్‌పేటలో సుమన్ అండ్ మదన్ మందన్న దంపతులకు 1996 ఏప్రిల్ 5 న జన్మించారు. వీళ్ళ ఇంట్లో ఈమెనే పెద్ద. ఆమె కొడగులోని కూర్గ్ పబ్లిక్ స్కూల్ లో పాఠశాల విద్యను, మైసూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కామర్స్ అండ్ ఆర్ట్స్‌లో ప్రీ-యూనివర్శిటీ కోర్సును కంప్లీట్ చేసింది. అలాగే రామయ్య కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ సైన్స్ అండ్ కామర్స్ నుండి సైకాలజీ, జర్నలిజం మరియు ఇంగ్లీష్ లిటరేచర్‌లో బ్యాచిలర్ డిగ్రీ పొందింది. కాలేజీ రోజుల్లోనే మోడలింగ్ చేసింది. కానీ సినిమాల లోకి రావాలని ఎప్పుడు అనుకోలేదు.

Image may contain: 1 person, smiling, close-up

వ్యక్తిగత జీవితం…
రష్మికకు కన్నడ నటుడు రక్షిత్ శెట్టితో రష్మిక నిశ్చితార్థం జరిగింది. కిరిక్ పార్టీ సినిమా చేసే సమయంలో ఈ ఇద్దరికీ స్నేహం కుదిరింది. కొన్ని రోజులు డేటింగ్ చూశాకా పెల్లు చేసుకోవాలనుకున్నారు. 3 జూలై 2017 న సొంత ఊరు విరాజ్‌పేటలో నిశ్చితార్థం చేసుకున్నారు. అయితే ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో ఈ జంట 2018 సెప్టెంబర్‌లో బ్రేకప్ చెప్పేసుకున్నారు. ప్రస్తుతం రష్మిక సింగిల్ గానే ఉంది.

Image may contain: one or more people, people standing, child and outdoor

సినీ ప్రస్థానం…
రష్మిక 2012 లో మోడలింగ్ ప్రారంభించింది. అదే సంవత్సరం క్లీన్ & క్లియర్ ఫ్రెష్ ఫేస్ ఆఫ్ ఇండియా టైటిల్‌ను గెలుచుకుంది మరియు క్లీన్ & క్లియర్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక అయ్యింది. అప్పుడు ఆమె లామోడ్ బెంగళూరు టాప్ మోడల్ హంట్ 2013 టివిసి టైటిల్‌ను సొంతం చేసుకుంది. అదే సమయంలో ఆమె ఫోటోలను చుసిన కిరాక్ పార్టీ సినిమా నిర్మాతలు, ఆమెను సంప్రదించి కిరాక్ పార్టీ సినిమాకు ఆమెను ఎంపిక చేశారు. అలా రష్మిక 2016 లో కిరాక్ పార్టీ సినిమాతో సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టింది. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. 4 కోట్లతో తీసిన ఈ సినిమా ఏకంగా 50 కోట్లు వసూలు చేసి ఆ సంవత్సరం ఎక్కువ కలెక్షన్స్ తీసుకొచ్చిన సినిమాగా సంచలనం క్రియేట్ చేసింది. అందులో ఆమె పోషించిన షాన్వి పాత్రకు మంచి పేరు వచ్చింది. ఇక ఈ సినిమా తర్వాత రష్మిక పునీత్ రాజ్‌కుమార్ సరసన అంజని పుత్రా చిత్రంలో నటించింది. ఇందులో రష్మిక నటన అద్భుతంగ ఉండడంతో అందరి ప్రశంసలు అందుకుంది. తర్వాత హీరో గణేష్ సరసన చమక్ చిత్రం చేసింది.

Image may contain: 2 people, people sitting and indoor

ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇలా కన్నడ భాషలో వరుసగా మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయవంతమయ్యాయి. కన్నడ చిత్ర పరిశ్రమలో ఆమె ‘హ్యాట్రిక్’ హీరోయిన్ గా నిలిచింది. ఇక కన్నడలో పేరు రావడంతో తెలుగు నిర్మాతల దృష్టి ఆమె మీద పడింది. కొన్ని ఆఫర్స్ వచ్చినా కూడా ఒప్పుకోలేదు. చివరికి చలో సినిమా కథ నచ్చడంతో ఆ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఈ సినిమాలో హీరో నాగశౌర్య. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వడంతో ఆమె విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక వెంటనే విజయ్ దేవరకొండ సరసన గీతా గోవిందం సినిమా ఆఫర్ వచ్చింది. ఈ సినిమా కూడా పెద్ద హిట్ అయ్యింది. కేవలం 5 కోట్లతో తీసిన ఈ సినిమా ఏకంగా 130 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా రష్మిక కెరీర్ లోనే పెద్ద హిట్. విజయ్ అండ్ రష్మిక జోడికి బ్రహ్మరథం పట్టారు జనం. ఈ సినిమాతో రష్మిక తెలుగులో పాతుకుపోయింది. వెంటనే హీరో నాని అండ్ నాగార్జున చేసిన మల్టీస్టారర్ సినిమా దేవదాస్ ఛాన్స్ కొట్టేసింది.

Image may contain: 1 person, smiling, close-up

ఈ సినిమా అనుకున్నంత విజయం సాధించలేదు. తర్వాత కన్నడలో యజమనలో నటించింది. ఈ సినిమా కూడా పెద్ద హిట్ అయ్యింది. ఇక తమిళ ఇండస్ట్రీలోకి కూడా అడుగుపెట్టింది. హీరో కార్తీ పక్కన నటిస్తుంది. ఈ చిత్రం త్వరలోనే విడుదల అవ్వబోతుంది. ప్రస్తుతం రష్మిక చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. తెలుగులో డియర్ కామ్రేడ్ సినిమా విడుదల అవ్వబోతుంది. ఈ సినిమా కూడా పెద్ద హిట్ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాగే కన్నడలో పోగారు చిత్రీకరణ కొనసాగుతోంది. అలాగే నితిన్ పక్కన భీష్మ చిత్రం చేస్తుంది. ఈ సంవత్సరం చివరి నాటికి విడుదల కానుంది. అలాగే సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ చెయ్యబోయే సినిమాలో కూడా రష్మిక హీరోయిన్ గా ఖరారు అయ్యింది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వబోతుంది. అలాగే అనిల్ రావిపుడి దర్శకత్వంలో మహేష్ బాబు 26 వ చిత్రం సరిలేరు నీకెవ్వరూ సినిమాలో నటిస్తుంది. అలాగే తమిళ్ లో లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ 64 వ చిత్రంలో హీరోయిన్ గా చేయబోతుంది. ఇలా తెలుగు, కన్నడ, తమిళ్ ఇండస్ట్రీలో వరుస అవకాశాలు దక్కించుకుని టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది.

ఈ క్రింది వీడియో ని చూడండి

అవార్డ్స్…
ఇక రష్మిక పలు అవార్డ్స్ కూడా సొంతం చేసుకుంది. 2016 లో కిరాక్ పార్టీ చిత్రానికి సైమా అవార్డు, ఐఫా అవార్డు, జీ కన్నడ హెమ్మాయ కన్నడతి అవార్డు, లవ్ లావికే రీడర్స్ ఛాయస్ అవార్డు అందుకుంది. ఇక 2017 లో చమ్మక్ చిత్రానికి ఫిలిం ఫెర్, సైమా అవార్డ్స్ కు నామినేట్ అయ్యింది. ఇక 2018 లో చలో చిత్రానికి ఫిలిం ఫెర్ అండ్ జీ సినీ అవార్డు అందుకుంది. అలాగే గీతా గోవిందం చిత్రానికి గాను శ్రీ కళా సుధా అవార్డు అందుకుంది. రష్మికా ‘బెంగళూరు టైమ్స్ 25 మోస్ట్ డిసైరెబుల్ ఉమెన్ ఇన్ 2014’ జాబితాలో చోటు సంపాదించింది. 2016లో ఆమె 24వ స్థానం లభించగా, 2017లో ఆమె మొదటి స్థానం సంపాదించింది.

ఇలా రష్మిక సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొన్ని రోజుల్లోనే తెలుగు కన్నడ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది. ఇక రాబోయే రోజుల్లో మరిన్ని చిత్రాలలో నటించి ప్రేక్షకులను అలరించాలని ఆశిద్దాం..