నితిన్‌తో రొమాన్స్ కు సై అంటున్న రష్మిక..

71

ఛలో చిత్రంలో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన అందాల ముద్దుగుమ్మ రష్మిక మందన.ఆ సినిమా తరువాత గీత గోవిందం చిత్రంలో నటించింది. ఈ చిత్రంతో రష్మిక ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది.సినిమా 100 కోట్లు కలెక్ట్ చెయ్యడంతో అటు విజయ్ దేవరకొండ స్టార్ హీరో అయ్యాడు.ఇటు రష్మిక క్రేజ్ కూడా పెరిగిపోయింది.ఆమె అందానికి నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

Image result for rashmika

రశ్మికకు ప్రస్తుతం క్రేజీ ఆఫర్స్ దక్కుతున్నాయి.రష్మిక మరోసారి విజయ్ దేవర కొండ సరసన డియర్ కామ్రేడ్ చిత్రంలో నటిస్తోంది.మల్టీస్టారర్ చిత్రం దేవదాస్ లో నాని సరసన నటిస్తుంది.తాజాగా రష్మిక మరో క్రేజీ ఆఫర్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది.రష్మికని ఛలో చిత్రంతో దర్శకుడు వెంకీ కుడుముల తెలుగు తెరకు పరిచయం చేశాడు.

Image result for rashmika nithin

వెంకీ ప్రస్తుతం నితిన్ తో ఓ రోమాంటిక్ ఎంటర్ టైనర్ కు ప్లాన్ చేశాడు. ఈ చిత్రంలో హీరోయిన్ గా రష్మికని ఎంచుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.త్వరలోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి భీష్మ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.చూడాలి మరి ఈ చిత్రంలో నటిస్తుందో లేదో.