ఢీ షో లో సుధీర్ చేసిన పనికి రష్మీ ఎలా రిప్లై ఇచ్చిందో తెలిసి షాకైన ప్రదీప్ శేఖర్ మాస్టర్

383

దక్షణ భారతదేశంలోనే అతిపెద్ద డాన్స్ రియాలిటీ షో డీ . ఈ షోకు ఎంత క్రేజ్ ఉందొ మన అందరికి తెలిసిందే…9 సీజన్స్ ముగించుకుని ఇపుడు “ఢీ-10” గా మనల్ని అలరించడానికి, ఎంటర్ టైన్ మెంట్ ని టన్నుల టన్నుల కొద్ది అందిస్తోంది. ప్రదీప్ యాంకర్ గా, రష్మి, సుడిగాలి సుధీర్ టీమ్ లిడర్స్ గా, హీరోయిన్ ప్రియమణి,శేఖర్ మాష్టర్ లు జడ్జిస్‌ గా ఢీ-10 షోకి వ్యవహరిస్తున్నారు.పెద్ద పెద్ద సెలెబ్రిటీలు మంచి డాన్సర్స్ మంచి కొరియోగ్రాఫర్స్ ఉన్న డీ షో కు ఎంత క్రేజ్ ఉందొ మన అందరికి తెలుసు.

Related image

అయితే ఈ షోలో స్పెషల్ అట్రాక్షన్ అంటే సుదీర్ రష్మీ అని చెప్పుకోవాలి. ఇద్దరి మధ్య ప్రేమ ఉందొ లేదో తెలీదు కానీ ఇద్దరి స్క్రీన్ కెమిస్ట్రీ మాత్రం చాలా బాగా ఉంటుంది. ఈ ఇద్దరు కలిస్తే ప్రేక్షకులకు ఫుల్ వినోదం అని అందరికి తెలుసు. ఇక వీరు డీ స్టేజ్ మీద చేసే స్కిట్స్ కు అయితే నవ్వని ప్రేక్షకుడు ఉండడు. అంతలా జనాలను అలరిస్తున్నారు. అలాంటి సుదీర్ కు రష్మీ ఇప్పుడు డీ స్టేజ్ మీదనే వార్నింగ్ ఇచ్చింది. ఎందుకు అనుకుంటున్నారా..డీ షోలో రష్మీ రెండవ రౌండ్ లో ఓడిపోగా సుదీర్ ఆమెకు ఒక టాస్క్ ఇవ్వాలి. అయితే ఎప్పటిలాగే ప్రదీప్ కల్పించుకుని టాస్క్ సుదీర్ కు వచ్చేలా చేస్తాడు. అయితే ఇద్దరు మొగుడూపెళ్లాలు గొడవపడి బతుకు జట్కా బండి లాంటి షోకు వెళ్లే స్కిట్ చేయాలని చెప్తాడు. మొగుడూపెళ్లాలుగా సుదీర్ ప్రదీప్ చెయ్యగా యాంకర్ గా రష్మీ చేసింది.

ఇక టాస్క్ స్టార్ట్ అవ్వడం అవవడంతోనే మొగుడూపెళ్లాలు గొడవపడినట్టు సుదీర్ ప్రదీప్ గొడవపడ్డారు. చంపేస్తా అని సుదీర్ అనగా చూశారా మేడమ్ మీ ముందే ఎలా అరుస్తున్నాడో అని భార్య పాత్ర చేస్తున్న ప్రదీప్ అన్నాడు. నన్ను కొడతాడని రష్మీకి కంప్లైంట్ ఇస్తాడు ప్రదీప్. అప్పుడు ప్రదీప్ ను కొట్టడానికి సుదీర్ వెళ్తాడు.ఆ సమయంలో రష్మీ సుదీర్ మీద కేకలు వేసింది.ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా నా షోకు వచ్చి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావు. మొహం పగలగొడతా అని సుదీర్ కు వార్నింగ్ ఇచ్చింది.సుదీర్ ను కొట్టినంత పని చేసింది. ఒక షోలో రోజా ఇలాగే ఇద్దరు మొగుడూపెళ్ళాలా మీద అరుస్తుంది. మొగుడిని కొట్టినంత పని చేస్తది. ఇప్పుడు రష్మీ కూడా అలాగే చేసింది. ఇది చూసినంత వరకు జడ్జీలు కంటిస్టెంట్స్ ఒకటే నవ్వారు. ఇలా సుదీర్ రష్మీ ప్రదీప్ లు కలిసి ప్రేక్షకులకు ఫుల్ వినోదాన్ని ఇచ్చారు.మరి వాళ్ళు చేసిన రచ్చ మొత్తం చూడాలంటే వచ్చే వారం మొదలయ్యే ఎపిసోడ్ వరకు ఎదురుచూడాల్సిందే. మరి సుదీర్ రష్మీ ప్రదీప్ చేసిన ఈ టాస్క్ గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.