అద్దె గర్భంతో కవల పిల్లలకు తల్లిగా మారిన రష్మీ

477

ర‌ష్మీకి ఇంకా పెళ్లికాలేదు ఇద్ద‌రు పిల్ల‌లు ఏమిటి అని అనుకుంటున్నారా.. జ‌బ‌ర్ద‌స్త్ యాంక‌ర్ ర‌ష్మీ గురించి కాదండి, మ‌నం చ‌ర్చించుకునేది.బాలీవుడ్ బుల్లితెర నిర్మాత రష్మీ శర్మ గురించి.. ఈమె గురించి మ‌నకు అంత తెలియ‌క‌పోయినా, బాలీవుడ్ అంతా తెలుసు, ఆమెకు ఫ్యాన్స్ ఉన్నారు. ముఖ్యంగా బుల్లితెర నిర్మాత ర‌ష్మి శ‌ర్మ ఫేమ‌స్ సెల‌బ్రెటీయే. ఇప్పుడు ఈమె గురించి వార్త ఏమిటి అని అనుకుంటున్నారా? ఆ విష‌య‌మే ఇప్పుడు చెప్ప‌బోతున్నాం.

rashmi sharma

 

ఆమె తాజాగా ఇద్దరు పిల్లలకు తల్లి అయింది. సరోగసీ విధానంతో ఆమె ట్విన్ బేబీ బాయ్స్‌కు తల్లిగా మారింది. నిజానికి ఈ ఇద్దరు పిల్లలను గతవారమే రష్మీ దంపతులు తమ ఇంటికి తీసుకొచ్చారు. కానీ, సమాచారాన్ని మాత్రం అత్యంత రహస్యంగా ఉంచారు. ఈ విష‌యం పై మొత్తానికి న్యూస్ వైర‌ల్ అవ‌డంతో ఇప్పుడు వీరు కూడా ఇది వాస్త‌వం అని చెబుతున్నారు…తన ప్రియుడు పవన్ కుమార్‌ను రష్మీ గత 2012 జూన్ 28వ తేదీన పెళ్లి చేసుకున్న విషయం తెల్సిందే. అయితే, వీరికి పిల్లలు కలగకపోవడంతో, సరోగసీ విధానం ద్వారా పిల్లలు కావాలని వైద్యులను సంప్రదించారు. వైద్యుల సూచన మేరకు అద్దెగర్భంతో రష్మి ఇద్దరు పిల్లలకు తల్లి అయింది.

Image result for సర్రోగసీ

రష్మీ బాలీవుడ్ టీవీ సీరియల్స్‌ను నిర్మించారు. అలాగే, పలు షోలకు నిర్మాతగా వ్యవహరించారు. అంతేకాకుండా, రష్మీ శర్మ టెలీఫిల్మ్స్ పతాకంపై పింక్ అనే చిత్రాన్ని కూడా నిర్మించారు. ఇలా బాలీవుడ్ లో టాప్ హీరోయిన్లు హీరోస్, ద‌ర్శ‌కుల‌తో ఆమెకు స‌త్సంబంధాలు ఉన్నాయి. వ్యాపార ప‌రంగా ఎంతో పేరు ఉంది. ఇటు బాలీవుడ్ సర్కిల్స్ లో ఆమె తెలియ‌ని వారు ఉండ‌రు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

బీటౌన్ లో ఆమెకంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు ఉంది. ఇప్పుడు ఇలా ఇద్ద‌రు బిడ్డ‌ల‌కు త‌ల్లి అవ‌డం పై వారికి ఆనందంగా ఉంది..ఈ జంట‌కు స‌న్నిహితులు కంగ్రాట్స్ తెలియ‌చేస్తున్నారు. ఈ విష‌యం ఎంత సీక్రెట్ గా ఉంచుదాము అని అనుకున్నా, అంద‌రికి తెలిసిపోయింది అని అంటుంది ఆమె.. మరి చూశారుగా దీనిపై మీ అభిప్రాయాల‌ను కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.