సుడిగాలి సుధీర్‌ను పెళ్లి చేసుకుంటారా అనే ప్ర‌శ్న‌కి ర‌ష్మి దిమ్మ‌తిరిగే స‌మాధానం.

401

జబర్దస్త్ కామెడీ షోలో స్కిట్లు చేసే క్రమంలో హాట్ యాంకర్ రష్మి మీద కొందరు టీం లీడర్లు సెటైర్లు వేయడం, ఆమె వేసిన చిట్టి పొట్టి డ్రెస్సులను ఉద్దేశించి ఎటకారంగా మాట్లాడటం తెలిసిందే. ఇక సుడిగాలి సుధీర్ అయితే రష్మిని చాలా సందర్భాల్లో ఇబ్బంది పెట్టాడు. అతడి వాలకం చూసి ఇద్దరి మధ్య ఎఫైర్ ఉందనే రూమర్స్ కూడా అప్పట్లో స్ప్రెడ్ అయ్యాయి.

Image result for sudigali sudheer and rashmi photosహాట్ యాంకర్ రష్మీ, జబర్దస్త్ కమెడియన్ సుధీర్ లవర్స్ గా బాగా పాపులర్ అవ‌డం వ‌ల్ల బుల్లితెర షోలు మ‌రింత ఫేమ‌స్ అవుతున్నాయి.. ఈ పుకార్ల వలనే వీరిద్దరూ చేసే షోస్ కి టీఆర్పీ అమాంతం పెంచేస్తుంది అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇటీవ‌ల సుధీర్ కూడా నాకు రష్మీకి ఎటువంటి అఫైర్ లేదు నేను ఆ సంగతి ఎన్నిసార్లు చెప్పినా ఎవరు పట్టించుకోవడం లేదు. ఈ మధ్య నాకు అమ్మాయిల పిచ్చి ఉందన్నట్లు స్కిట్స్ చేస్తున్నారు. దీనివలన నా క్యారెక్టర్ చెడ్డదని ప్రచారం సాగుతుంది. నేను పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిని ఎవరు ఇవ్వడానికి ముందుకు రావడం లేదంటూ’ తన ఆవేదనని వ్యక్తం చేశాడు. కొన్నిసార్లు మనపై మనం సరదాగా వేసుకునే జోకులే చిక్కులు తెస్తాయని సుధీర్ మంచి ఉదాహరణ అనే చెప్పాలి.. ఇక మ‌రోసారి ఈ విష‌యం పై ర‌ష్మీ కూడా కాస్త క్లారిటీ ఇచ్చింది.

జ‌బర్దస్త్ నటులు సుడిగాలి సుధీర్.. ప్రదీప్ ఇద్దరిలో ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోవాలని వస్తే ఎవరిని చేసుకుంటారనే ప్రశ్న యాంకర్ రష్మీ గౌతమ్‌కు ఎదురైంది. ఇందుకు ఆమె ఏం చెప్పిందంటే.. తన వర్క్ వేరు, వ్యక్తిగతం వేరని చెప్పింది. రెండూ వేరు వేరుగా వుంటాయి. ఇందులో వుండే వ్యక్తులు అందులోకి రారు. అందులో వుండే వ్యక్తులు ఇందులోకి రారని స్పష్టం చేసింది. అలాగే మీ పెళ్లి లవ్వా, అరేంజ్డ్ మ్యారేజా అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు.. సహజీవనం అనే ఆప్షన్ వుందిగా అంటూ తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది. కాగా బుల్లితెర యాంకర్‌గా మంచి క్రేజ్ కొట్టేసిన రష్మీ.. సినిమాల్లో కనిపిస్తూ… కుర్రకారు హృదయాలను దోచేస్తోంది. తాజాగా ట్విట్టర్ లైవ్ ఛాట్‌లో ప్రదీప్‌తో పెళ్లి గురించి స్పందించింది. తనకు పెళ్లి గురించి అడిగే ప్రశ్నలు నచ్చవని రష్మీ చెప్పుకొచ్చింది. పెళ్లికి ముందే తాను ఓ బిడ్డను దత్తత తీసుకుంటానని రష్మీ చెప్పుకొచ్చింది.