ఎన్టీఆర్ బయోపిక్ లో నేను నటించడం లేదు…రాశికన్నా

322

ఎన్టీఆర్ బయోపిక్‌లో స్టార్ కాస్ట్ భారీ ఎత్తున ఉండనుందని చాలా మంది యంగ్ హీరోయిన్లు అలనాటి హీరోయిన్ల పాత్రలను చేయబోతున్నారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్‌తో సూపర్ హిట్ పెయిర్ అయిన సావిత్రి, శ్రీదేవి, జయప్రద వంటి వారి పాత్రలు బయోపిక్‌లో ప్రస్తుత టాప్ హీరోయిన్స్ నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

సంబంధిత చిత్రం

శ్రీదేవి పాత్రకు రకుల్ ప్రీత్, జయప్రద పాత్రకు రాశీ ఖన్నాలను సెలెక్ట్ చేశారని మీడియాలో గాసిప్స్ గుప్పుమన్నాయి. దీనిపై రాశీ ఖన్నా స్పందించింది. తను ఎన్టీఆర్ బయోపిక్‌లో నటిస్తున్నట్టు వస్తున్న వార్తలు అబద్ధమని ఆమె స్పష్టం
చేసింది. తనను ఆ సినిమా దర్శకనిర్మాతలు అస్సలు సంప్రదించలేదని ఆమె అంటోంది.

సంబంధిత చిత్రం

తను ప్రస్తుతం క్రాంతిమాధవ్ దర్శకత్వంలో రూపొందే సినిమాలోనటించబోతున్నాను మరియు విజయ్ దేవరకొండ హీరోగా చేస్తున్న ఆ సినిమాలో నటిస్తుండటం ఆనందంగా ఉందని రాశీ అంటోంది.సినిమాను బాగా ప్రేమించే హీరోల్లో విజయ్ దేవరకొండ ఒకరని అతడితో పని చేయడం ఆనందమని అంటోంది. అందులో తనది నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్ర అని చెప్పుకొచ్చింది.