ఎన్టీఆర్ బయోపిక్ లో రాశికన్నా..ఏ పాత్ర చేస్తుందో చూడండి..

442

స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతోన్న సినిమా యన్.టి.ఆర్.తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం భారీ అంచనాలున్న సినిమాల్లో ‘యన్.టి.ఆర్’ ఒకటి. బాలకృష్ణ టైటిల్ రోల్ పోషిస్తోన్న ఈ సినిమా కోసం నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ప్రేక్షకుల అంచనాలను దృష్టిలో పెట్టుకుని పాత్రల ఎంపికను చాలా జాగ్రత్తగా చేపడుతున్నారు.

Image result for rashikanna

చాలా మంది ప్రముఖులు ఇందులో నటిస్తున్నారు.విద్యాబాలన్ కైకాల సత్యనారాయణ రానా లాంటి నటులు నటిస్తున్నారు.నారా చంద్రబాబునాయుడు పాత్ర కోసం రానాని, అక్కినేని నాగేశ్వరరావు పాత్ర కోసం సుమంత్‌ని శ్రీదేవి పాత్రకు రకుల్ ప్రీత్ సింగ్‌ను ఎంపిక చేసుకున్న విష‌యం తెలిసిందే.అయితే ఇందులో జయప్రద పాత్ర కూడా ఉంటుందని తెలిసింది.

Related image

ఎన్టీఆర్ తో కలిసి జయప్రద ఎన్నో చిత్రాలలో నటించింది.అందుకే ఆమె పాత్రను కూడా పెట్టాలని బాలకృష్ణ నిర్ణయించుకున్నట్టు తెలిసింది. జయప్రద పాత్రను హీరోయిన్ రాశీ ఖన్నా పోషించబోతున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ విషయం అఫీషియల్‌గా వెల్లడించనున్నారు.