విజ‌య్ దేవ‌ర‌కొండ స‌ర‌స‌న రాశీ ఖ‌న్నా..

368

యూత్ ఐకాన్ విజ‌య్ దేవ‌ర‌కొండ వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు. అర్జున్ రెడ్డి చిత్రం ఇచ్చిన జోష్ విజ‌య్‌లో కాన్ఫిడెన్స్ పెంచింది. ఆయన న‌టించిన గీతా గోవిందం ఆగ‌స్ట్ 15న విడుద‌ల కానుండ‌గా, టాక్సీవాలా చిత్రం విడుద‌ల‌కి సిద్ధం అయింది.ప్ర‌స్తుతం భరత్ కమ్మ ద‌ర్శ‌క‌త్వంలో మైత్రి మూవీ మేక‌ర్స్‌ పై విజ‌య్ దేవ‌ర‌కొండ డియ‌ర్ కామ్రేడ్ అనే చేస్తున్నాడు.

Image result for vijay devarakonda rashikanna

మ‌రో వైపు బైలింగ్యువ‌ల్ మూవీ నోటా చేస్తున్నాడు. ఎవడే సుబ్రమణ్యం సినిమా నిర్మించిన స్వప్నా సినిమాస్ బ్యానర్లో స్వప్న దత్ నిర్మాతగా నందిని రెడ్డి డైరక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడట . ఇక అదే కాకుండా రాజు డికె డైరక్షన్ లో కూడా ఓ సినిమా ఉంటుందని తెలుస్తుంది.ఈ చిత్రాలే కాకుండా మరొక చిత్రం చెయ్యడానికి ఒప్పుకున్నాడు.

Rashi Khanna pair with Vijay Deverakonda

విజ‌య్ త్వ‌ర‌లో మ‌ళ్ళీ మ‌ళ్ళీ ఇది రాని రోజు మ‌రియు ఓన‌మాలు ఫేం క్రాంతి మాధ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలోను ఓ సినిమా చేయ‌నున్న‌ట్టు తెలుస్తుంది. కొద్ది రోజులుగా ఈ చిత్రానికి హీరోయిన్ కోసం అన్వేష‌ణ జ‌రుపుతున్నారు‌.ఇప్పటికి హీరోయిన్ దొరికింది.అందాల భామ రాశీ ఖ‌న్నాని హీరోయిన్‌గా ఫైన‌ల్ చేసిన‌ట్టు తెలుస్తుంది. చిత్రంలో హీరో పాత్ర‌కి స‌మానంగా హీరోయిన్ పాత్ర ఉంటుంద‌ట‌. రాశీ ఖ‌న్నా క‌థానాయిక‌గా ఇటీవ‌ల వ‌చ్చిన చిత్రాల‌న్నీ మంచి విజ‌యం సాధించ‌డంతో ఈ చిత్రం కూడా మంచి హిట్ కొడుతుంద‌ని భావిస్తున్నారు.చూడాలి మరి ఈ ఇద్దరి పెయిర్ ఎలా ఉంటుందో..