రికార్డ్ క్రియేట్ చేసిన రంగస్థలం రంగమ్మ మంగమ్మ పాట

316

రామ్‌చరణ్‌, సమంత జంటగా నటించిన బ్లాక్‌బస్టర్‌ చిత్రం ‘రంగస్థలం’.సుకుమార్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇందులో రామ్‌చరణ్‌ చిట్టిబాబు పాత్రలో, సమంత రామలక్ష్మి పాత్రల్లో నటించారు. యాంకర్‌ అనసూయ, దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు అందించారు. 1980ల నేపథ్యంలో తెరకెక్కించిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది.

Image result for rangasthalam movie

ఎక్కువగా రాజమండ్రిలో ఈ సినిమా చిత్రీకరణ జరిగింది. ఈ సినిమా కోసం దాదాపు 30 ఏకరాల్లో చిన్న ఊరిని సృష్టించారు. మైత్రి మూవీ మేకర్స్‌ ఈ చిత్రాన్ని నిర్మించింది.మార్చిలో విడుదలైన ఈ చిత్రం మూడు రోజుల్లోనే రూ.100 కోట్లు రాబట్టింది.ఇప్పటికే ఎన్నో రికార్డ్స్ స్పృష్టించిన ఈ సినిమా ఇప్పుడు మరొక రికార్డ్ స్పృష్టించింది.ఈ చిత్రంలోని ‘రంగమ్మా మంగమ్మా..’ పాట ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనకు తెలుసు.కేవలం ఆ పాట కోసమే సినిమాను ఎక్కువసార్లు చుసిన వాళ్ళు ఉన్నారంటే అతిశయోక్తి కాదు.

Related image

ఇప్పుడు ఈ పాట కొత్త రికార్డ్ ను స్పృష్టించింది.ఈ పాట యూట్యూబ్‌లో రికార్డు సృష్టించింది.ఇప్పటివరకు ఈ పాటను 100 మిలియన్లు (10 కోట్లు) మందికిపైగా వీక్షించారు. ఈ ఏడాదిలో అతి తక్కువ సమయంలో పది కోట్ల మార్క్‌ను దాటిన తొలి దక్షిణాది పాటగా రికార్డు సృష్టించినట్లు చిత్రవర్గాలు సోషల్‌మీడియా ద్వారా వెల్లడించాయి.