హ్యాట్రిక్ కొట్ట‌నున్న రానా

374

టాలీవుడ్ లో లీడ‌ర్ సినిమాతో రాజ‌కీయ నేప‌థ్యం ఉన్న సినిమాలు అంటే ఇలా ఉండాలి అని ఓ ట్రెండ్ మార్క్ సృష్టించాడు రానా.. అయితే రానా రాజ‌కీయ క‌థానాయ‌కుడిగా ఆ నేప‌థ్యంలో వ‌చ్చే సినిమాలు చేయ‌డంలో ఒదిగిపోతాడు.. ఆయ‌న న‌ట‌న‌కు ఎవ‌రైనా ఫిదా అవ్వాల్సిందే.. రానా న‌ట‌న హావభావాలు అన్ని క‌థకు ప‌ట్టుకొమ్మ‌లుగా మార‌తాయి.

Image result for rana

లీడర్ తో పాటు, నేనే రాజు నేనే మంత్రి ఈ రెండు సినిమాలు రాజకీయ నేపథ్యంతో కూడుకొన్నవే. ఈ రెండు సినిమాలు విడుద‌ల అయ్యి రానాకు మంచి స‌క్సెస్ ని అందించాయి. ఇక ఇలాంటి క‌థ‌లు వ‌స్తే రానా ప‌క్క‌న పెట్ట‌డం లేద‌ట.. అక్క‌డ ఏదైనా పాయింట్ ద‌గ్గ‌ర భేధాలు వ‌స్తే వాటిని మ‌ర‌లా రాసుకుర‌మ్మ‌ని ద‌ర్శ‌కుల‌కు చెబుతున్నార‌ట.. అందుకే రానాకు ఇటువంటి క‌థ‌లు చెప్పేందుకు ద‌ర్శ‌కులు కూడా క్యూ క‌డుతున్నారు.

Image result for rana

తాజాగా రానా రాజ‌కీయ నేప‌థ్యం ఉన్న సినిమాలో న‌టించేందుకు ఒకే చేశారు అని తెలుస్తోంది…ఇక తాజాగా త‌న తదుపరి చిత్రం రాజకీయ నేపథ్యంతో కూడిన చిత్రం అట‌…ఈ సినిమాలో నటించబోతున్నట్టు ఇటీవల రానా స్వయంగా వెల్లడించారు. ఇప్ప‌టికే ఈ క‌థ ఫైన‌ల్ అయింది అని తెలుస్తొంది.. కొత్త ద‌ర్శ‌కుడితో ఈ సినిమాని రానా ఒకే చేశారు అని తెలుస్తోంది.