వెంకీ మామతో జతకడుతున్న మరొక స్టార్ హీరో?

193

ఎఫ్‌ 2 సినిమాతో సూపర్‌ హిట్ అందుకున్న సీనియర్ హీరో వెంకటేష్‌, మరో మల్టీస్టారర్ సినిమాకు రెడీ అవుతున్నాడు. అల్లుడు నాగచైతన్యతో కలిసి వెంకీ నటించనున్న వెంకీ మామ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ సినిమాకు బాబీ దర్శకుడు.జై లవకుశ తర్వాత బాబీ తీస్తున్న సినిమా ఇదే.ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ఫిబ్రవరి 21 నుంచి ప్రారంభం కానుంది.

Image result for venkymama

తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రస్టింగ్ న్యూస్ ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతుంది.. ఈ సినిమాలో యంగ్‌ హీరో రానా అతిథి పాత్రలో కనిపించనున్నాడట.సినిమాకు అది ముఖ్య పాత్ర అని తెలుస్తుంది.

Image result for venkymama rana

గతంలో రానా హీరోగా తెరకెక్కిన కృష్ణం వందే జగద్గురుం సినిమాలో వెంకీ గెస్ట్ అపియరెన్స్‌ ఇచ్చాడు. ఇప్పుడు రానా వెంకటేష్ సినిమాలో గెస్ట్ అప్పీరియన్స్ ఇస్తున్నాడు. దీంతో దగ్గుబాటి ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు.